Monsoon In India: దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాయి. అల్పపీడనాలతో పాటు ఆవర్తనాలు ఏర్పడడానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో( Telugu States ) పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఓ వారం రోజులపాటు ఈదురు గాలులు విస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటాయని స్పష్టం చేసింది. ప్రధానంగా ఏపీకి భారీ వర్ష సూచన ఉంది. ఈరోజు ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో సుడిగాలులు వీస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.
Also Read: వామ్మో అంత మందా.. ఏపీలో వారి పింఛన్లు కట్!
* ఉపరితల ఆవర్తనంతో..
ఒడిస్సా( Odisha) , ఝార్ఖండ్, బెంగాల్ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దానివల్ల భూమధ్య రేఖ నుంచి గాలులు వీస్తున్నాయి. అందుకే అరేబియా సముద్రంలో ఈరోజు గాలి వేగం గంటకు 49 కిలోమీటర్ల వేగంతో ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఏపీలో గంటకు 16, తెలంగాణలో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తాయి. ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఎటువంటి అల్పపీడనం లేదు. కానీ ఒడిస్సా ఉత్తరాన, బెంగాల్ దక్షిణాన ఆవర్తనం మాత్రం కొనసాగుతోంది. దాని ప్రభావంతోనే ఉత్తరాంధ్రలో వర్షాలు పడుతున్నాయి. మూడు రోజులపాటు ఇవి కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే రుతుపవనాల విస్తరణలతో ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఏర్పడి అవకాశం ఉందని కూడా అనుమానిస్తున్నారు.
* తగ్గిన ఉష్ణోగ్రతలు
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు( temperatures ) పూర్తిగా తగ్గాయి. వేడి వాతావరణం తగ్గింది. తెలంగాణలో ఈరోజు 30 నుంచి 31 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఇటీవల కాలంలో ఇంత తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఏపీకి సంబంధించి రాయలసీమలో 32 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ కొనసాగుతోంది. కోస్తాలో మాత్రం 32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే.. వర్షాలు పడుతుండడం, గాలులు వీస్తుండడంతో ఉత్తరాంధ్రలో 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇక పగటివేల తేమ తెలంగాణలో 59%, ఏపీలో 40 శాతం ఉంది. ఉత్తరాంధ్రలో మాత్రం 84% ఉండడం విశేషం. అందుకే అక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అనుకూల వాతావరణం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.