Chandrayaan Rover : చంద్రుడిలో దాగివున్న రహస్యాలను కనుగొనేందుకు ఇస్రో చంద్రయాన్_3 అనే ప్రయోగాన్ని చేపట్టింది. చంద్రయాన్_2 విఫలమైతే.. చంద్రయాన్_3 మాత్రం విజయవంతమైంది. ఇస్రో శాస్త్రవేత్తలు అనుకున్న విధంగా ప్రజ్ఞాన్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధ్రువం మీద దిగింది. ఇస్రో శాస్త్రవేత్తలు కోరుకున్న విధంగా పనిచేసింది. చంద్రయాన్_1 ద్వారా జాబిల్లి మీద నీటి జాడలు ఉన్నాయని కనుగొంటే, చంద్రయాన్_3 ద్వారా సల్ఫర్ ఆనవాళ్లు ఉన్నాయని తెలిసింది. అయితే వీటి జాడను ప్రజ్ఞాన్ కనిపెట్టింది. ఏకంగా చంద్రుడి మీద వంద మీటర్లు ప్రయాణించింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఇస్రో ప్రజ్ఞాన్ 100 నాట్ అవుట్ అంటూ ఒక ట్వీట్ చేసింది.
ఇక సూర్యుడు పై అధ్యయనానికి చేపట్టిన ఆదిత్య ఎల్_1 తన ప్రయాణాన్ని ప్రారంభించిన రోజే జాబిల్లిపై పరిశోధనలు సాగిస్తున్న చంద్రయాన్ _3 కీలకమైన మైలురాయి సాధించడం పట్ల శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపై 100 మీటర్ల దూరం విజయవంతంగా ప్రయాణం పూర్తి చేయడం పట్ల ఇస్రో అధికారులు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇది మరింత ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఇస్రో శనివారం చేసింది. రోవర్ ప్రయాణించిన మార్గాన్ని చూపించే చిత్రాన్ని పోస్ట్ చేసింది. ప్రజ్ఞాన్ 100 నాట్ అవుట్ అంటూ ఇస్రో పేర్కొంది. మరోవైపు చంద్రుడిపై రాత్రి ప్రారంభమయ్యే సమయం ఆసన్నమైన నేపథ్యంలో ఇస్రో అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడి రాత్రి వాతావరణాన్ని తట్టుకునే విధంగా ల్యాండర్ ను, రోవర్ ను స్లీప్ మోడ్ లోకి పంపారు. 14 రోజుల తర్వాత అవి తిరిగి పని చేస్తాయని ఇస్రో అధికారులు వెల్లడించారు.
సోలార్ ప్యానల్ ద్వారా శక్తిని పొందుతూ విక్రమ్, ప్రజ్ఞాన్ పనిచేస్తాయని ఇస్రో అధికారులు చెబుతున్నారు. ఒక్కసారి అక్కడ చీకటి పడితే ఉష్ణోగ్రత మైనస్ 180 డిగ్రీలకు పడిపోతుంది. ఈ సమయంలో ల్యాండర్, రోవర్ మనుగడ సాగించడం కష్టమే. అయితే, 14 రోజుల తర్వాత చంద్రుడిపై తిరిగి సూర్యోదయం అయిన తర్వాత విక్రమ్, ప్రజ్ఞాన్, వాటిలోని పే లోడ్లు తిరిగి పనిచేసే అవకాశాలు చాలా స్వల్పం. ముఖ్యంగా విక్రమ్ యాక్టివేట్ అయితేనే భూమికి సంకేతాలు చేరుతాయి.