దేశంలో వంట గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. వారం రోజుల క్రితం దేశంలోని గ్యాస్ కంపెనీలన్నీ వంట గ్యాస్ ధరలను ఏకంగా 50 రూపాయలు పెంచాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ కోసం వినియోగదారులు దాదాపు 700 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుంటే మరోవైపు వంట గ్యాస్ ధరలు కూడా పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Also Read: కస్టమర్లకు ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు..?
అయితే గ్యాస్ సిలిండర్లపై ఉండే ఆఫర్ల గురించి సరైన అవగాహన ఉంటే తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ ను పొందడం సాధ్యమవుతుంది. డిజిటల్ లావాదేవీలను ఎక్కువగా జరిపే వాళ్లు ఆన్ లైన్ ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకుంటే ఆఫర్లను పొందే అవకాశం ఉంటుంది. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంలతో పాటు అమెజాన్ సంస్థ సైతం గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది.
Also Read: భారీగా తగ్గిన బంగారం ధర.. వెండి ధర పతనం…?
డిజిటల్ పేమెంట్ యాప్స్ లో మొబైల్ నంబర్ ఎంటర్ చేసి లేదా ఎల్పీజీ కస్టమర్ ఐడీ ఎంటర్ చేసి సులువుగా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవచ్చు. పేటీఎం యాప్ ఈ నెలాఖరు వరాకు గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై ఏకంగా 500 రూపాయల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అయితే పరిమిత కాలమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండటంతో ఈ నెలాఖరు లోపు గ్యాస్ సిలిండర్ అవసరమైన వాళ్లు ఫస్ట్ ఎల్పీజీ అనే ప్రోమో కోడ్ ను వినియోగించి క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
అయితే పేటీఎం ద్వారా వినియోగదారులు ఒక్కసారి మాత్రమే క్యాష్ బ్యాక్ ను పొందే అవకాశం ఉంటుంది. అమెజాన్ పే ద్వారా కస్టమర్లు గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకుంటే 50 రూపాయల క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంక్ సైతం ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ సహాయంతో గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసుకునే వారికి 30 రూపాయల క్యాష్ బ్యాక్ ఇస్తోంది. ఆసక్తి ఉన్న కస్టమర్లు ఈ ఆఫర్లను వినియోగించుకుని గ్యాస్ సిలిండర్లను బుకింగ్ చేసుకోవచ్చు.