Homeజాతీయ వార్తలుJustice NV Ramana- Draupadi Murmu: రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించిన ఎన్వీ రమణ.....

Justice NV Ramana- Draupadi Murmu: రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించిన ఎన్వీ రమణ.. అరుదైన అవకాశం

Justice NV Ramana- Draupadi Murmu: స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు జరుపుకుంటున్న వేళ తెలుగు వ్యక్తి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ.రమణకు అరుదైన అవకాశం లభించింది. దేశంలో మొదటిసారిగా ఓ గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. స్వతంత్ర భారత ప్రథమ మహిళతో ప్రమాణం చేయించే అరుదైన అవకాశాన్ని చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియాగా ఉన్న ఎన్వీ.రమణ దక్కించుకున్నారు. తన బాధ్యతల్లో భాగంగా నిర్వర్తించే ఒక అరుదైన కార్యక్రమంతో ఆ ఘనత దక్కించుకున్న తొలి తెలుగు వ్యక్తిగా నిలిచారు.

Justice NV Ramana- Draupadi Murmu
Justice NV Ramana- Draupadi Murmu

చరిత్రలో నిలిచిపోయేలా..
దేశంలో ఇప్పటి వరకు 14 మంది రాష్ట్రపతులుగా పనిచేశారు. ఇందులో 9 మంది జూలై 25న ప్రమాణ స్వీకారం చేశారు. 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము కూడా జూలై 25న ప్రమాణం చేసి ఈ తేదీన ప్రమాణం చేసిన 10వ రాష్ట్రపతిగా నిలిచారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఉదయం 10:15 గంటలకు రాష్ట్రపతిగా ముర్ముతో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేయించి రాష్ట్రపతితో ప్రమాణం చేయించిన తొలి తెలుగు వ్యక్తిగా చరిత్రలలో నిలిచిపోయారు. జస్టిస్‌ ఎన్వీ రమణ అత్యున్నత రాజ్యంగ పదవి అధిరోహించారు.

Also Read: Forbes India- Syed Hafeez: ఫోర్బ్స్‌ ఇండియా’లో గోదావరి‘ఖని’జం.. సయ్య హఫీజ్‌కు అరుదైన గుర్తింపు!

Justice NV Ramana- Draupadi Murmu
Justice NV Ramana- Draupadi Murmu

ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత ఏపీ – తెలంగాణ ప్రభుత్వాలు అధికారికంగా ఆయనను సత్కరించాయి. ఇక, సీజేఐగా ఆయన కోర్టుల్లో ఉన్న న్యాయమూర్తుల ఖాళీల భర్తీ.. కొత్త కోర్టుల ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతితో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంటుంది. ఈ అవకాశం ఇప్పుడు ఎన్వీ రమణకు దక్కింది.

Also Read:TDP MPs: తలోదారిలో టీడీపీ ఎంపీలు? అసంతృప్తికి కారణాలేంటి?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular