Budget 2024 Expectations: ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్_2024 ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ క్రమంలో మార్కెట్ వర్గాల నుంచి సామాన్యుల వరకు బడ్జెట్లో ఎలాంటి వరాలు ప్రకటిస్తారు? ఏ రంగాలకు కోతలు విధిస్తారు? కొత్తగా ఏమైనా పన్నులు విధిస్తారా? జీఎస్టీ స్లాబు విధానంలో ఏమైనా మార్పులు ఉంటాయా? ఎన్నికలు కాబట్టి కొత్తగా ఏదైనా సంక్షేమాన్ని తెరపైకి తీసుకొస్తారా? అనే ప్రశ్నలు మెదులుతున్నాయి. అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఈ అంశాలు ఈసారి బడ్జెట్లో అత్యంత ఆసక్తికరంగా మారాయి.
మూలధన వ్యయం
ఒక దేశం ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే మూలధనాన్ని ఖర్చు పెట్టాలి. అదే సమయంలో ఆ ఖర్చుకు రెట్టింపు ఆదాయం వచ్చేలాగా చూసుకోవాలి. అందుకే మూలధనం సంస్థాను గత మార్గంలో సాగితే వృద్ధి అనేది పెరుగుతుందని ఆర్థికవేత్తలు అంటూ ఉంటారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మూలధన వ్యయం పెరుగుతోంది. అయితే ఈ ఖర్చును మౌలిక సదుపాయాల రంగం కోసం వినియోగిస్తోంది.. 2024_25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత ప్రభుత్వం 10.2 లక్షల కోట్లను మూలధన వ్యయం కింద ఖర్చు చేస్తుందని అనుకుంటున్నాం. అయితే ప్రభుత్వం ప్రతి విభాగంలో 20 శాతానికి పైగా విస్తరణ అంచనా వేస్తోంది.. కాకపోతే ఇది ఏడాది నుంచి ఏడాదికి 10 శాతం మేర మాత్రమే విస్తరణను సూచిస్తున్నది. కోవిడ్ అనంతర సంవత్సరాలు.. ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో ప్రభుత్వ మూలధన వ్యయం 10% మాత్రమే విస్తరణ సూచిస్తోంది. మూలధన వృద్ధి తగ్గిపోవడం, ఆర్థిక కార్యకలాపాలు, స్థూల జాతీయ ఉత్పత్తి వృద్ధిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ అభిప్రాయపడుతోంది.
ఉద్యోగాల సృష్టి
ఆర్థిక రంగంలో ఒడిదుడుకులు. కోవిడ్ తర్వాత ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగాల సృష్టికి తీవ్ర కొరత ఏర్పడింది. ఆర్థిక మాంద్యం కూడా తోడు కావడంతో నిరుద్యోగ రేటు పెరుగుతోంది. పట్టణ ప్రాంతాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఉద్యోగాల సృష్టి అనేది ప్రభుత్వానికి సవాల్ గా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెంచితే ఉద్యోగాల సృష్టి కొనసాగించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రసాయనాలు, సేవల వంటి రంగాలలో ప్రైవేట్ కంపెనీలను ప్రోత్సహిస్తే భారీగా ఉద్యోగాలు సృష్టించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.. గ్రామీణ మౌలిక సదుపాయాలను నిర్మించడం లేదా నగదు ప్రవాహాన్ని మెరుగుపరిచే ప్రోత్సాహకాలను అందించడం వల్ల ఉద్యోగాలు సృష్టించవచ్చు. రసాయనాలు, సేవల వంటి రంగాలకు వివిధ పథకాల పరిధిని విస్తరిస్తే వాటి తయారీకి డిమాండ్ ఏర్పడుతుంది. అప్పుడు ఉద్యోగాల సృష్టి సులభం అవుతుందని ప్రముఖ అంతర్జాతీయ సంస్థ డెలాయిట్ పేర్కొంది.
ఆర్థిక మందగమనం
ఎన్నికల ఒత్తిడి నేపథ్యంలో బడ్జెట్లో భారత స్థూల జాతీయోత్పత్తిలో 5.3 శాతానికి ఆర్థిక లోటును తగ్గించేందుకు నిర్మలా సీతారామన్ కసరత్తు చేసే అవకాశం ఉంది. ఎన్నికల ఒత్తిడి ఉన్నప్పటికీ ఆర్థిక లోటును జీడీపీలో 5.3 శాతానికి తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేయవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా ఎక్సేంజ్ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది.
సంక్షేమ పథకాలు
ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్లో వివిధ సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుతం జీఎస్టీ వసూలు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆయా పథకాలకు కేటాయింపులు భారీగా జరిపే అవకాశం ఉంది. కార్పొరేట్ రంగాలు కూడా కోలు కుంటున్న నేపథ్యంలో భారీగా పన్నులు వసూలు అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
వృద్ధిరేటు
వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో వినియోగదారుల డిమాండ్ పెంచే కొన్ని చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించే అవకాశం కల్పిస్తోంది. 2022_23 సంవత్సరంలో వ్యవసాయ రంగ అభివృద్ధి నాలుగు శాతం నుంచి 1.8 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అయితే వ్యవసాయం వృద్ధిరేటు సాధించేందుకు ఈ బడ్జెట్లో కేంద్రమంత్రి రైతులకు రాయితీలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల సంవత్సరం కావడంతో ఇప్పటికే రైతులకు ఇస్తున్న పెట్టుబడి సహాయాన్ని పెంచింది. నూతన మార్కెట్ల ఏర్పాటు, యంత్రాలపై రాయితీ, మద్దతు ధర కల్పించే చర్యలపై కేంద్ర మంత్రి ప్రకటన చేసే అవకాశం ఉంది.