2000 Notes Withdraw: రిజర్వ్ బ్యాంకు రెండు వేల రూపాయల నోటును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రూ.2 వేల నోట్లు దాచుకున్న వారు వాటిని బ్యాంకులో అందజేయాలని చెబుతున్నారు. సెప్టెంబర్ 30లో గా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఆ తరువా నోట్లు ఉంచుకున్నా అవి లెక్కలోకి రావు. దీంతో ఆ నోట్లు ఉంటే త్వరగా మార్చుకోవాలి. మొదట వాటిని మార్చుకోవాలని చెప్పారు. తరువాత వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. నోట్ల రద్దు వ్యవహారం ఓ ప్రహసనంగా మారుతోంది.
సెప్టెంబర్ 30 నాటికే నోట్లు మార్చుకోవాలి. మూడు నెలల సమయం ఉంది. కానీ సెలవులు కూడా బాగానే ఉన్నాయి. ఒక్కో నెలలో సగటున పదిహేను రోజుల సెలవులు వస్తున్నాయి. దీంతో ఈ లోపల నోట్లు మార్చుకుంటేనే మనుగడలో ఉంటాయి. లేదంటే వాటి విలువ పోతుంది. లెక్కలోకి రావు. అందుకే ఈ లోపల నోట్లు మార్చుకోవాలని చెబుతున్నారు.
జూన్ నెలలో పన్నెండు రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. 15న రాజా సంక్రాంతి, 28న బక్రీద్, 29న బక్రీద్, 30న ఈద్ ఉల్ ముల్క్ లతో రెండో శనివారం, ఆదివారాలతో కలిపి 12 రోజులు సెలవులు వచ్చాయి. ఇక జులై నెలలో 15 రోజులు సెలవులు వచ్చాయి. జులై 5న హర్ గోవింద్ జయంతి, 6న ఎంహఎచ్ఐపీ డే, 11న కేర్ పూజ, 13న భాను జయంతి, 17న యూ టిరోత్ సింగ్ డే, 21న ద్రుక్సాతేష్ జి, 28న అశూర, 29న మొహర్రం లతో 15 రోజులు సెలవులు వస్తున్నాయి.
ఆగస్టులో 14 రోజులు సెలవులు వస్తున్నాయి. 8న టెన్ దోంగ్ హో రమ్ పాట్, 15న స్వాతంత్ర్య దినోత్సవం, 16న పార్సి న్యూ ఇయర్, 18న తిథి ఆఫ్ శ్రీమంత శంకరదేవ, 28న ఫస్ట్ ఓనం, 29న తిరువోనం, 30న రక్షాబంధన్, 31న శ్రీ నారాయణ్ జయంతి ఉన్నాయి. ఇలా సెలవులు ఉండటంతో బ్యాంకు పనిదినాలు తక్కువగానే ఉన్నాయి. అందుకే రెండు వేల నోట్లు మార్చుకునే వారు త్వరగా చేసుకుంటేనే ఫలితం ఉంటుంది. లేదంటే అవిచెల్లకుండా పోయే ప్రమాదం ఎదురవుతుంది.