Vijay Deverakonda Vs Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నప్పటికి గౌతమ్ తిన్ననూరి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన మళ్లీ రావా, జెర్సీ సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకునేలా చేశాయి. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండ తో చేసిన కింగ్డమ్ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. అయితే మొదటి షో తోనే పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా ఎంతటి వసూళ్లను సాధిస్తోంది అనేది ఇప్పుడు కీలకంగా మారింది. నిజానికి ఈ సినిమాని మొదట రామ్ చరణ్ తో చేయాలనుకున్నారు. కానీ అనుకోని కారణాలవల్ల రామ్ చరణ్ పెద్ది సినిమాకి కమిట్ అవ్వడంతో గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండ తో ఈ సినిమాని చేశాడు. మొత్తానికైతే ఈ సినిమాతో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం చేశాడు. అయితే విజయ్ దేవరకొండ కాకుండా ఈ సినిమాను రామ్ చరణ్ చేసుంటే ఈ సినిమాకి మరింత రీచ్ అయితే వచ్చుండేది. అలాగే భారీ ఓపెనింగ్స్ కూడా దక్కేవి. ఇప్పటికి విజయ్ దేవరకొండ కి మంచి ఓపెనింగ్స్ వచ్చినప్పటికి రామ్ చరణ్ ఆడ్ అయితే ఈ సినిమా లెవెల్ అనేది భారీగా పెరిగిపోయేది. నిజానికి మంచి కథతో వచ్చిన గౌతమ్ తిన్న నూరి రామ్ చరణ్ ని కనక ఈ సినిమా మీదికి తీసుకొచ్చి ఉంటే ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యేవాడు. అలాగే స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయేవాడు…
Read Also: ‘కింగ్ డమ్’ పబ్లిక్ టాక్ : మూవీలో అదే మైనస్ అంట..
ఇక విజయ్ ఇంతవరకు యాక్టింగ్ తో మెప్పించినప్పటికి కమర్షియల్ సినిమాల్ని పెద్దగా చేసిన అనుభవం లేకపోవడంతో విజయ్ యాక్షన్ సన్నివేశాలలో కొంతవరకు తేలిపోయినట్టుగా అనిపించింది…అదే విధంగా గౌతమ్ తిన్న నూరి ఇప్పటివరకు కమర్షియల్ సినిమాలను చేయలేదు.
ఇదే తన మొదటి కమర్షియల్ సినిమా కావడం వల్ల ఆయన కొద్దివరకు ఇబ్బందులను ఎదుర్కున్నాడు. మొత్తానికైతే ఈ సినిమాకి ఒక స్టార్ హీరో తోడై ఉంటే ఈ సినిమా రీచ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండేది. పాన్ ఇండియాలో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని ఇటు హీరోకి, అటు దర్శకుడికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టేది. ఇప్పటికి కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తుంది.
Read Also: రిస్కీ స్టోరీ లైన్ తో రామ్ చరణ్,సుకుమార్ మూవీ..ఇలా అయితే కష్టమే!
కాబట్టి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతటి వసూళ్లను రాబడుతోంది అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉందని సినిమా చివర్లో చెప్పారు. మరి ఆ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఇప్పటికే సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశారా? లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…