చెర్రీ-బన్నీ మధ్య వార్ నడుస్తోందా?

సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైరవుతోన్నారు. సంక్రాంతి కానుకగా అల్లు అర్జున్ నటించిన ‘అల.. వైకుంఠపురములో’ రిలీజ్ అయింది. పాజిటిట్ టాక్ తెచ్చుకోవడంతో అల్లు అర్జున్ కెరీర్లో ‘అల.. వైకుంఠపురములో’ బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీ రిలీజ్ కు ముందు సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన రాంచరణ్ ‘అల.. వైకుంఠపురములో’ భారీ సక్సస్ తర్వాత ప్రశంసించకపోవడంతో బన్నీ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. అయితే దీనికి కారణం వేరే వుందని […]

Written By: Neelambaram, Updated On : February 26, 2020 3:16 pm
Follow us on

సోషల్ మీడియాలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైరవుతోన్నారు. సంక్రాంతి కానుకగా అల్లు అర్జున్ నటించిన ‘అల.. వైకుంఠపురములో’ రిలీజ్ అయింది. పాజిటిట్ టాక్ తెచ్చుకోవడంతో అల్లు అర్జున్ కెరీర్లో ‘అల.. వైకుంఠపురములో’ బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ మూవీ రిలీజ్ కు ముందు సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన రాంచరణ్ ‘అల.. వైకుంఠపురములో’ భారీ సక్సస్ తర్వాత ప్రశంసించకపోవడంతో బన్నీ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. అయితే దీనికి కారణం వేరే వుందని వార్తలు విన్పిస్తున్నాయి.

తాజాగా రాంచరణ్ ‘జాను’ సినిమాను ప్రశంసిస్తూ పోస్టు పెట్టాడు. బాక్సాఫీస్ హిట్టందుకున్న ‘అల..వైకుంఠపురములో’ గురించి మాట్లాడలేదని బన్నీ ఫ్యాన్సు గుస్సగా ఉన్నారు. పలువురు సినీ ప్రముఖులు సినిమాను ప్రశంసించినా రాంచరణ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో ‘జాను’ సినిమా గురించి రాంచరణ్ సోషల్ మీడియాలో ప్రశంసిస్తూ పెట్టడంతో బన్నీ ఫ్యాన్స్ రాంచరణ్ ను ఫైరవుతున్నారు. గడిచిన కొంతకాలంగా పవన్ స్టార్ వర్సస్ అల్లు అర్జున్ ఫ్యాన్సీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పవర్ స్టార్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఈ మాటల యుద్ధం కొంతవరకు తగ్గింది. తాజాగా రాంచరణ్-అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో కోల్డ్ వార్ నడుస్తోంది.

అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’ విజయంలో మెగా హీరోలెవరూ కనిపించడం లేదు. ఇటీవల అల్లు అరవింద్ ఆస్తుల పంపకం విషయంలో చిరంజీవి కలుగజేసుకోవడంతో మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ కి కొంత గ్యాప్ వచ్చిందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య విబేధాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో రాంచరణ్ పై బన్నీ ఫ్యాన్స్ ఫైరవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎంత వాస్తవముందోగానీ ఇటీవల కాలంలో మెగా హీరోల తీరు చూస్తే వీరిమధ్య ప్రొఫిషినల్ పోటీ తీవ్రంగా ఉన్నట్లు స్పష్టమవుతుంది. మరికొందు వీరి మధ్య ప్రొఫెషినల్ పోటీ తప్ప వారి కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు లేవని చెబుతున్నారు.