
అనసూయ.. ఓ అందమైన బుల్లితెర యాంకర్. అందం చందంలోనే కాదు.. చిలిపితనంలోనూ.. అల్లరి చేయడంలోనూ అనసూయను మించిన వారు లేరు. బుల్లితెరపై, వెండితెరపై వెలిగే ఈ ముద్దుగుమ్మ ప్రతీ పండుగను ఎప్పటికీ గుర్తిండిపోయేలా చేసుకుంటున్నారు. తాజాగా హోలీ పండుగను సైతం ఘనంగా చేసుకున్నారు.
తాను చేసుకునే ప్రతీపండుగను.. తన జీవితంలోని ప్రతీ ఘట్టాన్ని సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ పంచుకుంటుంది. ఎప్పటికప్పుడు తన సమాచారాన్ని అభిమానులతో కలిసి పంచుకుంటుంది. . తాజాగా ఈ భామ హోలీ సందర్భంగా అనసూయ చేసిన అల్లరి అంతా ఇంతాకాదు. . తన భర్తల పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసింది.. ప్రస్తుతం అవి వైరల్ అయ్యాయి.
అనసూయ బుల్లితెరపైనే కాదు.. వెండితెర మీద కూడా బిజీ అయ్యింది. సినిమాలతోపాటు ఐటెం సాంగ్ లో కనిపించే ఈ భామ ‘ఖిలాడి’ సినిమాలో మెయిన్ రోల్ లో కనిపించనుందట. హీరో రవితేజతో కలిసి ఇటలీ వెళ్లింది. ఆ తరువాత కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న రంగమార్తాండ సినిమాలోనూ ఈమెకు మెయిన్ రోల్ ఇచ్చారట.
తాజాగా హోలీ సందర్భంగా షార్ట్ నెక్కర్ వేసుకొని అందాలను ఆరబోసింది. కొడుకులు, భర్తతో హోలీ వేడుకలు జరుపుకుంటూ ఫొటోలకు ఫోజులిచ్చింది. అయితే హోలీ వేడుకల్లోనూ తాను అందంగానే ఉన్నానని చెప్పినట్లుగా ఆమె హాట్ ఫొటోలు పంచుకుంది. ఈ ఫొటోలు వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆ పిక్ లకు లైక్ లు, కామెంట్లు పెడుతూ హోరెత్తిస్తున్నారు.
