తెలంగాణ పీసీసీ ప్రకటనకు ముందే చిచ్చు రేగింది. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు అగ్గి రాజేశారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ గనుక ఇస్తే పార్టీకి రాజీనామా చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో సంచలనమయ్యాయి. పార్టీని రెండు చీలిపోయే ప్రమాదం ఉందన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే.. తాను పార్టీలో ఉండను అని వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేసే జగ్గారెడ్డి, కోమటిరెడ్డి కూడా పనికి రారా అని వీహెచ్ హైకమాండ్ ను ప్రశ్నించారు. తెలంగాణ వ్యతిరేకికి పీసీసీ ఇస్తారా? మేం మాత్రం జైలు చుట్టూ తిరిగాలా? అని వీహెచ్ నిప్పులు చెరిగారు. ఢిల్లీని కూడా రేవంత్ రెడ్డి మేనేజ్ చేస్తున్నారని వీహెచ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడం ఖరారైందన్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఇప్పటికే రేవంత్ ను ఖాయం చేశారని.. కోమటిరెడ్డికి ఏఐసీసీ పదవి ఇస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే టీ కాంగ్రెస్ లో సీనియర్లు భగ్గుమంటున్నారు.
తెలంగాణ పీసీసీ చీఫ్ రేస్ ఆసక్తి రేపుతోంది. ఇద్దరు దిగ్గజ నేతలు కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి బరిలో ఉన్నారు. ఏఐసీసీ దాదాపుగా తెలంగాణ పీసీసీ చీఫ్ ను ఖాయం చేసిందనే వార్తలు వస్తున్నాయి. రెండు రోజుల్లో ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. రేవంత్ కే పీసీసీ చీఫ్ అన్న వార్తల నేపథ్యంలో వీహెచ్ బయటపడి రచ్చ మొదలుపెట్టారు.