
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పెద్ద గుడ్ న్యూస్ చెప్పారు. రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరంగా ఉన్న పవన్ చాలా గ్యాప్ తర్వాత చేసిన మూవీ ‘వకీల్ సాబ్’. ఈ మూవీ విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతో పవర్ స్టార్ అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. వకీల్ సాబ్ తోనే పవన్ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
పింక్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడని ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి, ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. అయితే కమర్షియల్ సినిమా కాదు ఇది, పైగా ఎంటర్ టైన్మెంట్ కూడా ఈ సినిమాలో ఉండదు అనేది ఇప్పటికే టాక్ బయటకు వచ్చేసింది. మరి ఈ సినిమా పై పవన్ ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకుంటే… అది ఓవర్ హైప్ క్రియేట్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.
అయితే సినిమా బాగుంది అని రిపోర్ట్స్ బయటకు వస్తే మాత్రం.. పవర్ స్టార్ రీఎంట్రీతో టాలీవుడ్ లో కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేయడం గ్యారంటీ. అలాగే పవన్ శైలి నటనను మరోసారి వెండితెరపై చూడాలనే ఫ్యాన్స్ ఆశ కూడా ఈ సినిమాతో తీరుతుంది.
కానీ, పవన్ ఇదివరకు చేసినట్లు డాన్స్ లు అండ్ రొమాన్స్ చేసే పరిస్థితి ఈ సినిమాలో లేదు గనుక, సీరియస్ డ్రామాకి ఫ్యాన్స్ కూడా మానసికంగా సిద్ధ పడితే బెటర్. ఎందుకంటే అజ్ఞాతవాసి సినిమా పై కూడా పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఫ్యాన్స్ బాగా నిరుత్సాహ పడ్డారు. ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా పై కూడా ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే పింక్ కంటే కూడా ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ ను పెట్టడం.. పాటలు, రోమాన్స్ కు చాన్స్ ఇవ్వడంతో పవన్ అభిమానులు మెచ్చే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని తెలుస్తోంది.