ఆ దర్శకుడెప్పుడు అర్ధరాత్రి రెండింటికే.. !

‘ఈవీవీ సత్యనారాయణ’ నిజమైన శ్రమజీవి. సినిమా ఇండస్ట్రీలో వందల మందికి పని కల్పించి, ఎంతోమందికి బతుకునిచ్చిన గొప్ప దర్శకుడు. ఈవీవీ ఏమి చేసినా ప్రత్యేకతే. ముఖ్యంగా ఈవీవీలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే.. ప్రతి రోజూ రాత్రి రెండు గంటల వరకు స్క్రిప్ట్ రాసుకునేవారు. పైగా తను రాయడంతో పాటు తానూ చేసే ప్రతి సినిమాకీ నలుగురు రైటర్లని పెట్టుకునే వారు. ఈవీవీకి రాయడం చేతకాక కాదు, ఆయన రైటర్స్ ను పెట్టుకునేది, స్క్రిప్ట్ కి ఆయన […]

Written By: admin, Updated On : July 23, 2021 11:19 am
Follow us on

‘ఈవీవీ సత్యనారాయణ’ నిజమైన శ్రమజీవి. సినిమా ఇండస్ట్రీలో వందల మందికి పని కల్పించి, ఎంతోమందికి బతుకునిచ్చిన గొప్ప దర్శకుడు. ఈవీవీ ఏమి చేసినా ప్రత్యేకతే. ముఖ్యంగా ఈవీవీలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే.. ప్రతి రోజూ రాత్రి రెండు గంటల వరకు స్క్రిప్ట్ రాసుకునేవారు. పైగా తను రాయడంతో పాటు తానూ చేసే ప్రతి సినిమాకీ నలుగురు రైటర్లని పెట్టుకునే వారు.

ఈవీవీకి రాయడం చేతకాక కాదు, ఆయన రైటర్స్ ను పెట్టుకునేది, స్క్రిప్ట్ కి ఆయన ఇచ్చే విలువ అది. ఆయన దృష్టిలో సినిమా అంటే.. టీమ్ వర్క్. అందుకే నలుగురు రచయితల చేత రాయించేవారు. అలాగే ఆయన కూడా ఓ వైపు రాస్తూనే ఉండేవారు. అర్ధరాత్రి అంతా అలా స్క్రిప్ట్ గురించే హెవీ డిస్కషన్స్ జరుగుతూ ఉండేవి.

పైగా పొద్దునే అందరి కంటే ముందే లేచి, నలుగురు రచయితలు రాసిన వాటినీ చూసి.. అందులో ఏది బాగుంటే అది తీసుకొని వారికీ ఎక్కువ రెమ్యునరేషన్ ఇప్పించేవారు. కట్ చేస్తే షూటింగ్ టైం అయిపోయేది. ఇక టిఫిన్ కూడా చేయకుండా హడావిడిగా అన్ని చూసుకుని ఓ సీన్ ఫైనల్‌ చేసి, ఆ పేపర్‌ నే స్పాట్‌ లోకి తెచ్చి మళ్ళీ మార్పులు ఏమి చేయకుండా ఎంతో వేగంగా షూట్ చేసేవాడు.

దీనిబట్టి షూటింగ్ జరుగుతున్నంత సేపూ ‘ఈవీవీ’కి సరిగ్గా నిద్ర ఉండేది కాదు. అసలు, ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అంతలా కష్టపడుతున్న వారు మరొకరు ఆ రోజుల్లో లేరు అంటే.. అతిశయోక్తి కాదు. అందుకే, అప్పటి నటీనటులు ‘ఈవీవీ’ గురించి మోటుగా ఒక్క మాట చెప్పుకుంటూ ఉండేవారట. గొడ్డులాగా కష్టపడతాడు, పనిరాక్షసుడు అంటూ ‘ఈవీవీ’ గురించి కథలు కథలుగా చెప్పేవారట.

‘ఈవీవీ’కి ఇలాంటి బిరుదులు రావడానికి మరో ముఖ్య కారణం ఏమిటంటే… ఆయన చేతిలో మైక్ పట్టుకుని యాక్షన్ అన్నాక, ఇక ఈ ప్రపంచాన్ని మర్చిపోతారు. అలా చాలాసార్లు అర్ధరాత్రి రెండింటికి షూటింగ్‌ ప్యాకప్‌ చెప్పిన సందర్భాలు కూ కోకొల్లలు ఉన్నాయట. అందుకే ‘ఈవీవీ’ పనిరాక్షసుడిగా ముద్ర పడిపోయారు.