
ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించడంతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలకు కొవిడ్ వ్యాక్సిన్ వేస్తే థర్డ్ వేవ్ కు ఆస్కారం ఉండదని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా అన్నారు. థర్డ్ వేవ్ అనేది అది ప్రజలు వ్యవహరించే తీరు, వ్యాక్సిన్ వేయడంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఒకవేశ వచ్చినా మూడో దశ ప్రభావం తక్కువగా ఉంటుందని తెలిపారు. వ్యాక్సిన్ మిక్సింగ్ పై ప్రస్తుతం పరిశోధనలు కొనసాగుతున్నాయని, దానిపై ముందుకెళ్లేందుకు మరింత డేటా అవసరం ఉందని చెప్పారు.