రాష్ట్రంలో సమగ్ర భూసర్వేకు ఆమోదం తెలుపుతూ పలు కీలక నిర్ణయాలను ఏపీ కేబినెట్ తీసుకుంది. ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ఈరోజు ఉదయం 11 గంటలకు నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ భేటి అనంతరం రాష్ట్ర మంత్రి పేర్ని నాని ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
Also Read: కేశినేని నాని సంచలన ట్వీట్
భూసర్వే, సరిహద్దు చట్టంలో సవరణలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు. సబ్ డివిజన్ ప్రకారం మ్యాప్ తయారు చేస్తామని.. ఆక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా భూసర్వే జరుగుతుందని మంత్రి వివరించారు. మూడేళ్లలో భూసర్వే పూర్తి చేసి ప్రతి సరిహద్దుకి జియో ట్యాగింగ్ చేయాలని నిర్ణయించింది. సమగ్ర ల్యాండ్ రికార్డులు తయారు చేయడం ద్వారా రైతు హక్కులకు రక్షణ కల్పించాలని డిసైడ్ అయ్యింది.
ఇక తిరుపతిలో సర్వే ట్రైనింగ్ కాలేజీ ఏర్పాటుకు 40 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పశుసంవర్ధక శాఖలో ల్యాబ్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 27 మెడికల్ కాలేజీల ఏర్పాటు, అభివృద్ధికి రూ.16వేల కోట్ల నిధులను మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ ద్వారా సేకరించాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ (ఏపీఎంఈఆర్సీ) సంస్థ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేయడానికి మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇన్ ఫుట్ సబ్సిడీని ఆర్టీజీఎస్ ద్వారా నేరుగా చెల్లింపులు చేయాలని.. ఏ సీజన్ పరిహారం ఆ సీజన్ లోనే చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది.
Also Read: సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ భారీ ఊరట
ఏపీలో కొత్త పర్యాటక విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కరోనాతో దెబ్బతిన్న పర్యాటక ప్రాజెక్టులకు రీస్టార్ట్ ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. హోటల్లు, రెస్టారెంట్లు, టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లకు సాయం చేయాలని నిర్ణయించింది. 198.05 కోట్ల పర్యాటక ప్రాజెక్టులకు రీస్టార్ట్ ప్యాకేజీనిచ్చింది. దీనివల్ల రాష్ట్రంలో 3910 పర్యాటక సంస్థలకు ఆర్థికంగా లబ్ధి కలుగనుంది.
రాష్ట్ర అదనపు ఏజీగా జాస్తి నాగభూషణం నియామకానికి ఆమోదం.. ఏప్రిల్, మే, జూన్ కాలానికి ఫిక్స్ డ్ ఛార్జీల రద్దుకు ఆమోదం.. ప్రస్తుత ఫిక్స్ డ్ చార్జీలు వాయిదాల్లో చెల్లింపునకు ఆమోదం
1100 సినిమా థియేటర్లకు రుణాలు, వడ్డీపై రాయితీకి కేబినెట్ నిర్ణయించింది. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నాబార్డు నుంచి రూ.1931 కోట్ల రుణం కేటాయిస్తూ జలవనురుల శాఖకు అనుమతి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్