
అఫ్గానిస్థాన్ లోని పంజ్ షీన్ వ్యాలీని స్వాధీనం చేసుకున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. పంజ్ షీర్ ప్రావిన్స్ రాజాధాని బజరక్ లోని గవర్న్ ర్ కార్యాలయంపై తాలిబన్లు తమ జెండా ఎగురవేశారు. ఇప్పుడు పంజ్ షీర్ మొత్తం తమ చేతుల్లోకి వచ్చేసిందని ప్రకటించారు. ఈ విజయంతో దేశంలో యుద్ధం పూర్తిగా ముగిసిందని ప్రెస్ నోట్ విడుదల చేశారు. పంజ్ షీర్ ప్రజలను ఎలాంటి వివక్ష లేకుండా తమ సోదరులుగా చూసుకుంటామని తెలిపారు.