తెలంగాణ కరోనా సెకండ్ వేవ్.. మంత్రి ఈటల క్లారిటీ

కరోనా కల్లోలం తెలంగాణలో మరోసారి మొదలైందంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో..మీడియాలో వార్తలు హోరెత్తుతున్నాయి. బ్రిటన్ నుంచి వచ్చిన తెలంగాణ వాసులకు కొత్త కరోనా స్రెయిన్ పాజిటివ్ గా తేలడంతో రాష్ట్రంలో కంగారు మొదలైంది. ఈ క్రమంలోనే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. Also Read: శివరాజ్‌సింగ్‌తో కేసీఆర్‌‌ పర్సనల్‌ భేటీ : ఆంతర్యం ఏంటి..? బ్రిటన్ లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్ గురించి ఈటల రాజేందర్ ఊరటనిచ్చే కబరు […]

Written By: NARESH, Updated On : January 1, 2021 7:53 pm
Follow us on

కరోనా కల్లోలం తెలంగాణలో మరోసారి మొదలైందంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో..మీడియాలో వార్తలు హోరెత్తుతున్నాయి. బ్రిటన్ నుంచి వచ్చిన తెలంగాణ వాసులకు కొత్త కరోనా స్రెయిన్ పాజిటివ్ గా తేలడంతో రాష్ట్రంలో కంగారు మొదలైంది. ఈ క్రమంలోనే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.

Also Read: శివరాజ్‌సింగ్‌తో కేసీఆర్‌‌ పర్సనల్‌ భేటీ : ఆంతర్యం ఏంటి..?

బ్రిటన్ లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్ గురించి ఈటల రాజేందర్ ఊరటనిచ్చే కబరు చెప్పారు. బ్రిటన్ నుంచి తెలంగాణకు వ్యాపించిన కొత్త రకం కరోనా వైరస్ ప్రాణాంతకం కాదని.. ఈ కొత్త రకం వైరస్ శరవేగంగా విస్తరించే లక్షణం కలిగి ఉందని.. ప్రాణాలు తీసేంత బలం లేదని ఈటల వివరించారు. ఈ వైరస్ విషయంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.  కరోనా వ్యాక్సిన్ వచ్చిన వెంటనే 10వేల మంది సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తామని మంత్రి ఈటల తెలిపారు. ఆ తరువాత రోజుకు 10లక్షలమందికి పైగా వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి ఈటల వెల్లడించారు.

కొత్త రకం వైరస్ పై కేంద్రం అధ్యయనం చేస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తగా ఉందని ఈటల వివరించారు. చలికాలం కాబట్టి ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోందని.. ఎండాకాలం వస్తే అసలు తెలంగాణలో కరోనా వేవ్ ఉండదని క్లారిటీ ఇచ్చారు.  బ్రిటన్ నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపిన మంత్రి ఈటల.. వారిలో కరోనా పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను సీసీఎంబీకి పంపించామని తెలిపారు.ఇప్పటివరకు ఒకరికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు.

Also Read: ‘సాగర’ మథనం చేస్తున్న కేసీఆర్..!

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ లేదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.. తెలంగాణలో కరోనా ఫస్ట్ వేవ్ కూడా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. కొందరు సోషల్ మీడియాలో దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రకమైన ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని మంత్రి ఈటల రాజేందర్ ప్రజలకు సూచించారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్