Homeఅత్యంత ప్రజాదరణSarkaru Vaari Paata Teaser Record : మహేష్ బాబు సంచలనం.. రికార్డుల మోత!

Sarkaru Vaari Paata Teaser Record : మహేష్ బాబు సంచలనం.. రికార్డుల మోత!

Sarkaru Vaari Paata Teaser Record

Sarkaru Vaari Paata Teaser Record : టాలీవుడ్ అగ్ర‌హీరోల జాబితాలో ముందువ‌ర‌స‌లో ఉంటాడు మ‌హేష్ బాబు. బాల న‌టుడిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మై.. ఆ త‌ర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి.. టాప్ స్టార్ గా దూసుకెళ్తున్నాడు. ప్రిన్స్ లేటెస్ట్ మూవీ ‘స‌ర్కారువారి పాట‌’. ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ చిత్రానికి సంబంధించి.. మ‌హేష్ బాబు బ‌ర్త్ డే సంద‌ర్భంగా టీజ‌ర్ ను లాంఛ్ చేశారు. ఇందులో సూప‌ర్ స్టార్ క్యూట్ లుక్ ఫ్యాన్స్ ను ఫిదా చేసేసింది. అదే స‌మ‌యంలో టీజ‌ర్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను అమాంతం పెంచేసింది. ఇప్పుడు అరుదైన రికార్డు సాధించింది.

‘సక్సెస్ ఈజ్ ఏ జర్నీ’ అంటూ.. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు మ‌హేష్. భరత్ అనునేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న మహేష్ బాబు.. ‘స‌ర్కారువారి పాట‌’తో వరుసగా నాలుగో సక్సెస్ ను టేస్ట్ చేయాలని చూస్తున్నారు. ‘గీతా గోవిందం’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్వకుడు పరశురామ్.. ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంస్థలతో కలిసి మహేష్ బాబు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

బ్యాంకులను మోసం చేసి పారిపోయే బడా పారిశ్రామిక వేత్తలపై సంధించే విమర్శనాస్త్రంగా ఈ చిత్రం రూపొందుతోంద‌ని ప్ర‌చారం సాగుతోంది. బ్యాంకును మోసం చేసిన ఓ కార్పొరేట్‌.. బ్యాంకు ఉద్యోగిగా ప‌నిచేసే హీరో తండ్రిపై నింద మోపి విదేశాల‌కు పారిపోతాడ‌ని టాక్‌. తండ్రి నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు రంగంలోకి దిగిన కొడుకు.. అత‌డి ఆట ఎలా క‌ట్టించాడ‌న్న క‌థాంశంతో ఈ చిత్రం రూపొంద‌నుంద‌ని స‌మాచారం.

ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు.. టీజ‌ర్ ద్వారా అద్దిరిపోయే విందు ఏర్పాటు చేశాడు ద‌ర్శ‌కుడు. అదికూడా.. మ‌హేష్ బాబు బ‌ర్త్ డే సంద‌ర్బంగా రిలీజ్ చేయ‌డంతో.. ఫ్యాన్స్ పండ‌గ చేసుకున్నారు. దీంతో.. విడుద‌లైన 24 గంట‌ల్లోనే ఈ టీజ‌ర్ ఏకంగా 23.06 మిలియ‌న్ వ్యూస్, 7 ల‌క్ష‌ల‌కు పైగా లైకులు సాధించి స‌త్తా చాటింది. ఆ విధంగా.. తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే 24 గంట‌ల్లో అత్య‌ధిక వ్యూస్ సాధించిన చిత్రంగా నిలిచింది.

ఓవ‌రాల్ గా చూసుకున్న‌ప్పుడు అత్య‌ధిక వ్యూస్ సాధించిన టీజ‌ర్ల‌లో ‘స‌ర్కారువారి పాట’ టీజ‌ర్ ఐదో స్థానంలో ఉంది. దీనికన్నా ముందు పుష్ప, భీమ్ ఫర్ రామరాజు, రామరాజు ఫర్ భీమ్, అఖండ టీజర్లు ఉన్నాయి. లైకుల విషయానికి వస్తే.. సర్కారు వారి పాట టీజర్ మూడో స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో పుష్ప, ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్లు ఉన్నాయి. ఈ విధంటా ఆల్ టైమ్ కేట‌గిరీలో.. లైకులు, వ్యూస్ లో టాప్ 5 లో నిలిచింది మ‌హేష్ టీజ‌ర్‌.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Oktelugu Epaper
Exit mobile version