
Rohit Sharma and Kohli : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది నిజమే అనిపించేలా పలు ఆధారాలు కూడా కనిపించాయి. వీరిద్దరూ గతంలో మైదానంలో ప్రవర్తించిన తీరు.. చివరకు కుటుంబ సభ్యులు కూడా పరస్పరం వ్యవహరించిన విధానం.. గ్యాప్ ఏర్పడిందని అనిపించాయి. అయితే.. తాజాగా ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో కోహ్లీ-రోహిత్ ప్రవర్తనతో క్రికెట్ ఫ్యాన్స్ కు క్లారిటీ వచ్చేసింది.
రోహిత్ – కోహ్లీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనే విషయం ఇప్పుడు కాదు.. 2019లోనే బయటకు వచ్చింది. అప్పటి వన్డే వరల్డ్ కప్ లో తుదిజట్టు విషయంలో కోహ్లీ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో విభేదాలు చోటు చేసుకున్నాయనే ప్రచారం సాగింది. ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేలా.. కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మను ఇన్ స్టా గ్రామ్ లో అన్ ఫాలో చేశాడు రోహిత్. అనుష్క సైతం రోహిత్ భార్య రితికాను అన్ ఫాలో చేసేసింది. దీంతో.. అందరూ కన్ఫామ్ చేసుకున్నారు. వీరిద్దరి మధ్య గొడవలు తారస్థాయికి చేరాయని నిర్ధారించుకున్నారు.
ఆ తర్వాత కూడా.. ఈ సందేహాలు కొనసాగాయి. పలు మ్యాచ్ ల చూసేందుకు వచ్చిన సమయంలో అనుష్క శర్మ ఒక దగ్గర.. రితికా మరో చివర కూర్చున్న ఫొటోలు హల్ చల్ చేశాయి. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ ను ఎంపిక చేయకపోవడం కూడా వివాదాన్ని రాజేసింది. అప్పుడే.. రోహిత్ గాయం గురించి తనకు సమాచారం లేదని కెప్టెన్ చెప్పడం కూడా అందరినీ షాక్ కు గురిచేసింది. ఈ విధంగా.. ఇద్దరి మధ్య పంచాయితీ చాలా దూరం వెళ్లిందనే డిస్కషన్ నడిచింది.
అయితే.. ఇప్పుడు నాలుగో టెస్టులో వీరిద్దరూ కలిసి నవ్వులు చిందించడంతో వివాదం సద్దుమణిగిందా? అనే చర్చ మొదలైంది. రెండో ఇన్నింగ్స్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన రోహిత్.. సెంచరీ కొట్టాడు. ఈ సందర్భంగా గ్యాలరీలోని టీమిండియా సభ్యులు కేరింతలు కొట్టారు. కోహ్లీ మరింత ఆనందంతో చప్పట్లు కొట్టాడు. అదేవిధంగా.. లార్డ్స్ టెస్టులో కోహ్లీ రివ్యూకు వెళ్లడంతో బెయిర్ స్టో ఔటైన సందర్భంలోనూ రోహిత్ శర్మ కోహ్లీని కౌగిలించుకొని అభినందించాడు. ఈ రెండు సాక్ష్యాలను చూపిస్తున్న ఫ్యాన్స్.. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారంటూ కామెంట్ చేస్తున్నారు.
https://twitter.com/TrendsRohit/status/1434162116634628096?s=20