
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటేనే కత్తులు, తుపాకులతో దాడులు చేయడం.. ఆ సీన్లు లేకుండా ఆయన సినిమా తీయడం లేదంటే అందరూ ఆశ్చర్యపోవాలి. కానీ వాటినే సినిమా మొత్తం నింపేస్తే ఎలా ఉంటుందో తాజాగా విడుదలైన ‘డి కంపెనీ’ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
వివాదాస్పద చిత్రాలు, సమాజంలోని నేరగాళ్లు,సంఘటనలపై చిత్రాలు తీయడంలో వర్మ పెట్టింది పేరు. తాజాగా ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై వర్మ సినిమా తీశాడు. అదే ‘డికంపెనీ’ ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది.
ట్రైలర్ చూస్తే మొత్తం తుపాకులతో చంపుకోవడాలే కనిపిస్తోంది. రక్తపాతం నిండిపోయింది. మాఫియా, ముంబై అండర్ వరల్డ్స్ క్రైంలు ట్రైలర్ నిండా జొప్పించాడు. 1980లో దావూద్ మాఫియా గ్యాంగ్ చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. హీరోను ఎలివేట్ చేస్తూ కాస్త సెక్స్, లవ్ ను మిళితం చేసి అమ్మాయిలను కామంతో వేధించే సీన్లను చొప్పించి మొత్తానికి ముంబైలో దావూద్ చేసిన ఆగడాలను సినిమాగా తీశారని తెలుస్తోంది. సాగర్ మంచనూరు నిర్మించిన ఈ చిత్రాన్ని మార్చి 26న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
https://www.youtube.com/watch?v=ADx_i4BQxtE