https://oktelugu.com/

దక్షిణాదివారి ధ్యాసంతా దానిగురించే.. మంటపుట్టించిన పూజాహెగ్డే మాటలు..!

పక్కింటి పుల్ల కూర రుచి అన్నట్లు మన టాలీవుడ్ దర్శక నిర్మాతలకు ఉత్తరాది భామలే ముద్దుగా కన్పిస్తుంటారు. ఎక్కడొక్కడి నుంచో వెతికిమరీ పట్టుకొచ్చి సినిమా అవకాశాలు ఇస్తుంటారు. ఆ భామలేమో ఇక్కడ పేరు.. డబ్బు సంపాదించుకొని స్టార్డమ్ రాగానే మనవాళ్లపైనే చులకన వ్యాఖ్యలు చేస్తుండటం కామన్ అయిపోయింది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ తాజాగా దక్షిణాదివారిని ఉద్దేశించి ముంబై భామ పూజా హెగ్డే చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో మంటపుట్టిస్తున్నాయి. ‘ముకుంద’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన […]

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2020 / 11:40 AM IST
    Follow us on

    పక్కింటి పుల్ల కూర రుచి అన్నట్లు మన టాలీవుడ్ దర్శక నిర్మాతలకు ఉత్తరాది భామలే ముద్దుగా కన్పిస్తుంటారు. ఎక్కడొక్కడి నుంచో వెతికిమరీ పట్టుకొచ్చి సినిమా అవకాశాలు ఇస్తుంటారు. ఆ భామలేమో ఇక్కడ పేరు.. డబ్బు సంపాదించుకొని స్టార్డమ్ రాగానే మనవాళ్లపైనే చులకన వ్యాఖ్యలు చేస్తుండటం కామన్ అయిపోయింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    తాజాగా దక్షిణాదివారిని ఉద్దేశించి ముంబై భామ పూజా హెగ్డే చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో మంటపుట్టిస్తున్నాయి. ‘ముకుంద’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా టైంలోనే ఆమెకు బాలీవుడ్లో ‘మొహంజదారో’ ఆఫర్ వచ్చింది. అయితే ఆ మూవీ డిజాస్టర్ గా మిగిలింది. దీంతో పూజా హెగ్డే సౌత్ సినిమాలపైనే ఫోకస్ పెట్టి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

    Also Read: హ్యపీ బర్త్ డే గురూజీ.. టాలీవుడ్లో త్రివిక్రమ్ జర్నీ..!

    సౌత్ ఇండస్ట్రీలో గ్లామర్ డాళ్ గా పూజా హెగ్డే గుర్తింపు తెచ్చుకొంది. డీజే మూవీలో తన నడుము అందాలను అరబోసి కుర్రకారును ఫిదా చేసింది. దీంతో ఆమెకు వరుసగా టాప్ హీరోల సరసన నటించే అవకాశాలు వెల్లువెత్తడంతో పూజా హెగ్డే క్రేజ్ బాగా పెరిగింది. దీంతో బాలీవుడ్లోనూ అవకాశాలు వస్తున్నాయి. అయితే ఈ అమ్మడు సౌత్ ఇండస్ట్రీపై తాజాగా చేసిన హాట్ కామెంట్స్ పై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.

    దక్షిణాదివారికి ధ్యాసంతా నడుముపైనే ఉంటుందని.. అదొక్కటి చూపిస్తే చాలని.. అంతేకాకుండా మిడ్ డ్రెస్సుల్లో తమను చూడాలనుకుంటారంటూ పూజా చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ‘అలవైకుంఠపురములో’ తన కాళ్లను చూపించారని గొప్పలు చెప్పుకుంది. సౌత్ ప్రేక్షకులను కించపరిచేలా చేసిన ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ స్టేటస్  ఇచ్చిన ఇండస్ట్రీపైనే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతావా? నువ్వు ఎందుకు అలాంటి పాత్రలు చేశావంటూ పూజా హెగ్డేను ఏకిపారేస్తున్నారు.

    Also Read: సోనూ సూద్ ఇంత సాయం ఎందుకు చేస్తున్నాడో తెలుసా?

    టాలీవుడ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకొని బాలీవుడ్ కు వెళ్లిన తాప్సీ సైతం గతంలోనూ తాప్సీ సైతం అగ్ర దర్శకుడు రాఘవేంద్రరావును కించపరిచేలా వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో నెటిజన్లు ఆమెను ఏకిపారేయగా తాజాగా పూజా హెగ్డే వ్యాఖ్యలు మంటపుట్టిస్తున్నాయి. ఇప్పటికైనా దర్శక, నిర్మాతలు నార్త్ భామల వ్యామోహం నుంచి బయటపటి తెలుగమ్మాయిలకు ఛాన్సిస్తే బాగుంటుందనేే కామెంట్స్ విన్పిస్తున్నాయి.