
కేంద్రం రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున బ్యాంకు ఖాతాలలో జమ చేస్తున్న సంగతి తెలిసిందే. పీఎం కిసాన్ స్కీమ్ 8వ విడత నిధులు నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. దేశంలోని 11.66 కోట్ల మంది రైతులకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈరోజు నుంచే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయని సమాచారం.
Also Read: మధ్యతరగతి ప్రజలకు శుభవార్త చెప్పిన మోదీ సర్కార్..?
రైతుల ఖాతాలలో 2,000 రూపాయలు జమై ఉంటే మొబైల్ ఫోన్ కు నగదు జమైనట్లు మెసేజ్ వస్తుంది. పీఎం కిసాన్ వెబ్ సైట్ ద్వారా కూడా ఈ స్కీమ్ కు సంబంధించిన నగదు జమైందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ కు లింక్ అయిన మొబైల్ నంబర్ కు మెసేజ్ రాకపోతే మాత్రం 2,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో ఇంకా జమ కాలేదని అర్థం చేసుకోవాలి. అర్హత ఉండి నగదు జమ కాని వాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
రోజురోజుకు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. ప్రతి సంవత్సరం ఈ స్కీమ్ కింద రైతుల ఖాతాలలో ఏకంగా 6,000 రూపాయలు జమ చేస్తోంది. అయితే కేంద్రం విడతల వారీగా ఈ నగదును రైతుల ఖాతాలలో జమ చేస్తుండటం గమనార్హం. కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక స్కీమ్ లను అమలు చేస్తున్నాయి.
Also Read: ప్రజలకు శుభవార్త.. ఆధార్ పాన్ లింక్ గడువు పొడిగింపు..?
రైతులకు ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో ఏపీలోని జగన్ సర్కార్, తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ వేర్వేరు పేర్లతో రైతులకు పెట్టుబడి అందించే స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.