
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ల ద్వారా పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు కేంద్రం ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్ లలో పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కూడా ఒకటి కాగా ఈ స్కీమ్ లో చేరడానికి కేవలం వారం రోజుల గడువు మాత్రమే ఉంది. సొంతింటి కలను సాకారం చేసుకోవలనుకునే వాళ్లు ఈ స్కీమ్ లో చేరడం ద్వారా ఏకంగా రూ.2.67 లక్షల తగ్గింపును పొందవచ్చు.
మార్చి 31వ తేదీ వరకు ఈ స్కీమ్ అమలు కానుండగా మొదటిసారి ఇల్లు కొనుగోలు చేస్తే మాత్రమే ఈ ప్రయోజనం చేకూరనుంది. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ద్వారా ఈ స్కీమ్ ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు. హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొనుగోలు చేస్తే ఈ స్కీమ్ ద్వారా రూ.2.67 లక్షల తగ్గింపు లభిస్తుంది. ఆధార్ కార్డును కలిగి ఉన్నవాళ్లు ఈ స్కీమ్ ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
కనీసం 100 రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించడం ద్వారా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. తక్కువ ఆదాయం ఉన్నవారు, ఆర్థికంగా వెనుకబడిన వారు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు. వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించి మరికొన్ని వివరాలను తెలుసుకోవచ్చు.
కొన్ని రోజుల వరకు మాత్రమే ఈ స్కీమ్ అమలవుతూ ఉండటంతో ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఇల్లు కొనాలని అనుకునే వాళ్లకు మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.