దేశంలోని వాహనదారులకు భారీ షాక్ తగ్గిలింది. గత కొన్ని రోజుల నుంచి నిలకడగా ఉన్న పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి. గడిచిన 50 రోజులుగా దేశంలో పెట్రోల్ ధరలు తగ్గడం, నిలకడగా ఉండటం జరుగుతోంది. అయితే 50 రోజుల తరువాత పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చాయి. నేడు హైదరాబాద్ లో పెట్రోల్ ధర 22 పైసలు పెరగగా డీజిల్ ధర 28 పైసలు పెరిగింది. పెట్రోల్ ధర 84.47 రూపాయలకు చేరగా డీజిల్ ధర 77.12 రుపాయలకు పెరిగింది.
గత కొన్ని రోజులుగా డీజిల్ ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. అయితే ఈరోజు మాత్రం డీజిల్ ధరలు కూడా పెరిగాయి. దేశంలోని అన్ని చోట్ల పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్పంగా మార్పులు చోటు చేసుకున్నాయి. అమరావతిలో పెట్రోల్ ధర 24 పైసలు పెరగగా డీజిల్ ధర 29 పైసలు పెరిగింది. హైదరాబాద్, అమరావతితో పోల్చి చూస్తే విజయవాడలో పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్పంగా పెరుగుదల నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 87.92 రూపాయలకు చేరగా డీజిల్ ధర 77.11 రూపాయలకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు పెరగడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల నమోదైందని తెలుస్తోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 0.18 శాతం పెరుగుదలను నమోదు చేసుకోగా డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్ కు 0.05 శాతం పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలను బట్టి దేశీయ ఇంధన కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పులు చేస్తూ ఉంటాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కోరోజు ఒక్కో విధంగా ఉంటాయి. కొన్నిసార్లు పెరిగితే కొన్నిసార్లు తగ్గుతాయి. మరికొన్ని సార్లు ధరలు స్థిరంగా ఉంటాయి.