హైదరాబాద్లో జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉండగానే ప్రధాన పార్టీలన్నీ నువ్వా.. నేనా అన్నట్లు తలపడుతున్నాయి. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో బీజేపీ సైతం కేంద్ర మంత్రులను రంగంలోకి దింపి ప్రచారం చేయిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రధానంగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతున్నాయి.
Also Read: పూరి స్పీడుకు బ్రేక్ వేసిందెవరు?
తెలంగాణలో జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత పోటీ నుంచి తప్పుకొని బీజేపీకే జనసైనికులు ఓటేయాలని పిలుపునిచ్చారు. పవన్ నిర్ణయంపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈక్రమంలోనే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ జనసేనాని రాజకీయాలపై సంచలన కామెంట్ చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి.
ప్రకాశ్ రాజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ పూటకో మాట మార్చే ఊసరవల్లి అంటూ వ్యాఖ్యానించారు. అభిమానులు.. కార్యకర్తలు బీజేపీకి ఓటెయ్యాలని చెబితే ఇక జనసేన ఎందుకంటూ సూటిగా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కు నిజంగా ఏమైందో తనకు అర్థం కావడం లేదని.. ఆయన నిర్ణయాలపై మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యానట్లు తెలిపారు.
Also Read: ‘ఆచార్య’.. ‘రాధేశ్యామ్’ మరింత ఆలస్యం.. కారణమేంటి?
2014లో పవన్ బీజేపీ వాళ్లు అద్భుతం.. ఇంద్రుడు.. చంద్రుడు అన్నారని గుర్తుచేశాడు. ఆ తర్వాతి ఎన్నికల్లో వాళ్లు ద్రోహులయ్యారని.. తాజాగా మళ్లీ వీళ్లే నాయకులుగా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. పవన్ ఇలా మూడు.. నాలుగుసార్లు మారుతున్నారంటే.. ఊసరవల్లి అయి ఉండాలంటూ మండిపడ్డారు. నువ్వొక లీడర్.. మీకొక పార్టీ ఉంది.. మళ్లీ ఇంకో నాయకుడి వైపు వేలు చూపించడం ఏంటి? అంటూ ప్రశ్నించారు.
ప్రకాశ్ రాజ్ ఇంతటితో ఆగకుండా పవన్ జాతి హితం కోసమే బీజేపీకి మద్దతు అంటే.. వీళ్లు ఏం మాట్లాడున్నారంటూ మండిపడ్డారు. దేశంలోని జాతీయ పార్టీలైన్నీ ఫెయిల్ అయ్యాయని ప్రకాశ్ రాజ్ అన్నారు. గతంలో ఇలా వచ్చిన వారికి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని.. ఈసారి ఆయన బిజీగా ఉన్నారని తెలిపారు. దీంతో ఈసారి ప్రజలే జాగ్రత్తగా ఉండాలని.. ప్రజలారా.. ఈసారి మీరే ఇలా వచ్చిన వారికి, వారి వెంట ఉన్నవారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి పంపాలని పిలుపునిచ్చారు. అయితే ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్