https://oktelugu.com/

కొత్తరకం కరోనా వైరస్.. భారత్ అప్రమత్తం.. ఆ దేశ ప్లైట్స్ బంద్..!

బ్రిటన్లో కొత్తరకం కరోనా వైరస్ వేగంగా ప్రబలుతోంది. కరోనా కంటే 70శాతం వేగంగా ఈ కొత్తరకం వైరస్ వ్యాప్తి చెందుతుండటం ఆందోళన రేపుతోంది. గత వారంరోజులుగా ఈ వైరస్ తో రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే బ్రిటర్లో లక్షలాది మంది ఈ కొత్తరకం కరోనా బారినపడినట్లు సమాచారం. ఈక్రమంలోనే బ్రిటన్ ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను రద్దు చేయడంతోపాటు లాక్డౌన్ ను కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈసారి కుటుంబ సభ్యులతోనే క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని బ్రిటన్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 21, 2020 / 05:09 PM IST
    Follow us on

    బ్రిటన్లో కొత్తరకం కరోనా వైరస్ వేగంగా ప్రబలుతోంది. కరోనా కంటే 70శాతం వేగంగా ఈ కొత్తరకం వైరస్ వ్యాప్తి చెందుతుండటం ఆందోళన రేపుతోంది. గత వారంరోజులుగా ఈ వైరస్ తో రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే బ్రిటర్లో లక్షలాది మంది ఈ కొత్తరకం కరోనా బారినపడినట్లు సమాచారం.

    ఈక్రమంలోనే బ్రిటన్ ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను రద్దు చేయడంతోపాటు లాక్డౌన్ ను కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈసారి కుటుంబ సభ్యులతోనే క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవలే కోరారు.

    బ్రిటన్లో కొత్తరకం వైరస్ విజృంభిస్తుండటంతో అన్ని దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే యూకే నుంచి రానున్న విమానాలను జర్మనీ.. ఇటలీ.. బెల్జియం.. ఆస్ట్రియా.. ఐస్ ల్యాండ్.. బల్జిరియా తదితర దేశాలు నిలిపివేశాయి.

    తాజాగా ఈ జాబితాలో భారత్ కూడా చేరింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భారత్ ముందస్తు చర్యల్లో భాగంగా ఆ దేశానికి చెందిన ప్లైట్లను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 22 నుంచి ఇది అమల్లోకి రానుంది.

    ఇక అంతకన్నా ముందుగా బ్రిటన్ నుంచి వచ్చిన వారందరు భారత విమానాశ్రయాల్లో కరోనా టెస్టులు తప్పనిసరిగా చేయించుకోవాలని కేంద్రం కోరింది. కాగా ఈ కొత్త స్ట్రెయిన్ కు బ్రిటన్ శాస్త్రవేత్తలు ‘వీయూఐ 202012/01’గా పేరు పెట్టారు.