https://oktelugu.com/

నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక.. జానారెడ్డికి జాక్ పాట్..!

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం జానారెడ్డి చుట్టూనే తిరుగుతున్నాయి. నాగార్జున్ సాగర్ ఎమ్మెల్యే నోములు నర్సింహాయ్య అకాల మరణంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక జరుగనుంది. దీంతో టీఆర్ఎస్.. బీజేపీలు జానారెడ్డిని తమ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం సైతం అలర్టై జానారెడ్డితో మాట్లాడింది. ఆయా పార్టీల నుంచి జానారెడ్డికి పలు ఆఫర్లు వస్తుండంతో ఆయనకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. Also Read: అవును..కేసీఆర్ మోడీని మెచ్చుకున్నారు..!? దుబ్బాకలో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన టీఆర్ఎస్ నాగార్జున్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 9, 2020 / 07:57 PM IST
    Follow us on

    తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం జానారెడ్డి చుట్టూనే తిరుగుతున్నాయి. నాగార్జున్ సాగర్ ఎమ్మెల్యే నోములు నర్సింహాయ్య అకాల మరణంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక జరుగనుంది. దీంతో టీఆర్ఎస్.. బీజేపీలు జానారెడ్డిని తమ పార్టీలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం సైతం అలర్టై జానారెడ్డితో మాట్లాడింది. ఆయా పార్టీల నుంచి జానారెడ్డికి పలు ఆఫర్లు వస్తుండంతో ఆయనకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది.

    Also Read: అవును..కేసీఆర్ మోడీని మెచ్చుకున్నారు..!?

    దుబ్బాకలో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన టీఆర్ఎస్ నాగార్జున్ సాగర్లో మాత్రం అది రిపీట్ కాకూడదని భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నాగార్జున్ సాగర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ పావులు కదుపుతుంది. దీంతో జానారెడ్డిని టీఆర్ఎస్ ఆ పార్టీలోకి ఆహ్వానించిందనే ప్రచారం జరుగుతోంది. జానారెడ్డికి కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జానారెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకు పలు డిమాండ్లు విన్పించారనే టాక్ విన్పిస్తోంది.

    నాగార్జున్ సాగర్ ఉప ఎన్నికకు ముందు తాను టీఆర్ఎస్ లో చేరితో తన కుమారుడు రఘువీర్ రెడ్డికి అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వడంతోపాటు తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరినట్లు ప్రచారం జరుగుతుంది. దీనికి కేసీఆర్ హామీ ఇస్తే ఆ పార్టీలో చేరుతానని చెప్పినట్లు పలు కథనాలు వస్తున్నాయి.

    ఇక బీజేపీ సైతం జానారెడ్డిని తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ పార్టీకి కూడా జానారెడ్డి పలు ఆప్షన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను బీజేపీలో చేరితే తన కుమారుడి అసెంబ్లీ సీటు ఇవ్వడంతోపాటు తనకు గవర్నర్ పదవీ ఇవ్వాలని కోరాడట. దీంతో బీజేపీ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

    Also Read: వరద సాయం కొనసాగుతుంది.. బాధితులు అధైర్య పడొద్దు: జీహెచ్ఎంసీ

    అయితే దీనికి భిన్నంగా మరో కథనం విన్పిస్తోంది. జానారెడ్డి కాంగ్రెసులోనే కొనసాగుతానని టీఆర్ఎస్.. బీజేపీలకు స్పష్టం చేశారని.. తన గెలుపు సహకరించాలని తిరిగి ఆ పార్టీలనే ఆయన కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి ఆ రెండు పార్టీలు ఒప్పుకుంటాయా? అనేది సందేహంగా మారింది.

    ఇక దుబ్బాకలో ఓటమిపాలైన టీఆర్ఎస్ తెలంగాణలో బీజేపీ బలపడుతుంటంతో నాగార్జున్ సాగర్లో బలహీన అభ్యర్థిని నిలబెట్టి జానారెడ్డికి సహకరిస్తుందనే టాక్ విన్పిస్తోంది. తెలంగాణలో బీజేపీకి చెక్ పెట్టాలంటే కాంగ్రెస్ సైతం రేసులో ఉండాల్సిందనేని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నాయి. అయితే దీనికి సీఎం కేసీఆర్ ఏమేరకు అంగీకరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక జానారెడ్డికి జాక్ పాట్ తెచ్చినట్లే కన్పిస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్