ఆ మాటకొస్తే నిజానికి ఈ ముదురు జంట పెళ్లి చేసుకోవాలని దాదాపు రెండేళ్లుగా అనుకుంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లో గతేడాది పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టి పెళ్లి డేట్ ను కూడా ఫిక్స్ చేసుకున్నారు. అంతలో లాక్ డౌన్ పెట్టడంతో.. తమ పెళ్లిని అప్పుడు రద్దు చేసుకున్నారు. దాంతో ఈ ఏడాది మే నెలలో మళ్ళీ పెళ్లిని ఖాయం చేసుకున్నారు. కానీ, ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ వచ్చి వారి ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది.
ఇక ఇప్పట్లో తమ పెళ్లిను ప్లాన్ చేసుకునే ఆలోచనలో తాము లేము అని మలైక క్లారిటీ ఇచ్చింది. అయినా ఇద్దరూ పెళ్లి చేసుకోకపోతే ఏమి ఒకే ఇంట్లో భార్యాభర్తలు లాగానే కలిసి ఉంటున్నారు. ఎలాగూ మలైక తన మొదటి భర్తకి విడాకులు ఇచ్చింది, అలాగే తన పిల్లలకు కూడా తన ప్రేమ గురించి పూర్తిగా వివరించింది కాబట్టి, ఇక ఆమెకు అడ్డు అదుపు లేకుండా పోయింది.
మలైకా ప్రస్తుతం సినిమాలు కూడా తగ్గించింది. కొన్ని ఐటమ్ సాంగ్స్ చేయడానికి ఆమె ఒప్పుకోవడానికి ఎదురుచూస్తున్నా ఛాన్స్ లు అయితే రావడం లేదు. ఎప్పుడైతే సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ నుండి ఆమె విడిపోయిందో.. అప్పటి నుండి బాలీవుడ్ మేకర్స్ మలైకాకి ఛాన్స్ లు ఇవ్వడం మానేశారు. ఇక అర్జున్ కపూర్ కి కూడా సరైన హిట్ పడటం లేదు.