
ఇంగ్లండ్ తో నిన్న రాత్రి జరిగిన తొలి టీ20లో టీమిండియా తేలిపోయింది. 124 పరుగులకే చాపచుట్టేసింది. అయితే బ్యాటింగ్ లో ఘోరంగా ఫెయిల్ అయిన కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ లో మాత్రం అదరగొట్టేశాడు. ఓ సూపర్ సిక్స్ ను ఆపేసి అభిమానులను షాక్ కు గురిచేశాడు. ఆ వీడియో ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంగ్లండ్ తో జరిగిన తొలి టీ20లో బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ బౌండరీ లైన్ వద్ద సిక్స్ ను ఆపిన విధానం నభూతో నభవిష్యతి అన్న లెవల్లో ఉంది. అందరినీ కట్టపడేసింది.
ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తుండగా అక్షర్ పటేల్ 5వ ఓవర్ బౌలింగ్ చేస్తుండగా బట్లర్ కొట్టిన బంతి బౌండరీ లైన్ దగ్గర్లో సిక్స్ గా పోతోంది. అయితే కేఎల్ రాహుల్ గాల్లో అమాంతం లేచి క్యాచ్ అందుకొని లైన్ పై పడబోతుండగా దాన్ని గాల్లోనే మైదానంలోకి విసిరేశాడు. అలా ఏకంగా సిక్స్ పోవాల్సిన దశలో 5 పరుగులనే ఆపి అందరినీ అబ్బురపరిచాడు.
ఖచ్చితంగా సిక్స్ అనుకున్న షాట్ ను రాహుల్ ఆపిన తీరుకు అభిమానులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి టీ20లో టీం ఇండియా 124కే చాప చుట్టేసింది. 20ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 124 పరుగులే చేసింది. ఇంగ్లండ్ పేసర్ల ధాటికి కోహ్లీ సేన విలవిల్లాడింది. ఇక అనంతరం బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లండ్ ఓపెనర్లు స్వేచ్ఛగా ఆడుతూ కేవలం 16 ఓవర్లలోనే 125 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.
https://twitter.com/pranjal__one8/status/1370400647820943364?s=20