బాలీవుడ్ బ్యూటీల్లో కియారా అద్వానీ ప్రస్తుతం లీడింగ్ బ్యూటీ. స్టార్ హీరోయిన్స్ మధ్య చిన్న హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి… ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ కన్నా నాలుగు రూపాయిలు ఎక్కువ కావాలంటున్న క్రేజీ బ్యూటీ కియారా. నిజానికి కియారా ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు ఆమెకి ఇచ్చింది లక్ష రూపాయిలు. అది కూడా పదిహేను రోజుల పాటు షూటింగ్ లో పాల్గొంటే.
అయితే, ఆ బోల్డ్ సిరీస్ పుణ్యమా అని అమ్మడికి ఫాలోయింగ్ పీక్స్ కి వెళ్ళింది. దాంతో “భరత్ అనే నేను”లో మహేష్ సరసన అవకాశం వచ్చింది. ఆ సినిమాలో నటించినప్పుడు కియారాకి ఇచ్చింది 80 లక్షలు. ఇక “వినయ విధేయ రామ”కి కోటి ఎనభై లక్షలు అందుకొందని అన్నారు. కానీ ఇప్పుడు, కియారా రెమ్యునరేషన్ తో మూడు చిన్న సినిమాలు తీయొచ్చు.
అది కియారా రేంజ్. బాలీవుడ్ లోనే ఫుల్ బిజీగా ఉంది. పైగా ఒక్కో సినిమాకి 4 కోట్లు తీసుకుంటోంది, అలాగే అదనపు సొమ్ము ఎలాగూ డిమాండ్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కియారానే హీరోయిన్ గా పెట్టుకోవాలని టాలీవుడ్ మేకర్స్ కి ఆశ కలుగుతుంది. ఇక తెలుగులో నటించాలంటే ఎందుకు తక్కువకి చేస్తోంది. అందుకే భాషతో నాకు సంబంధం లేదు. సినిమాకి 4 కోట్లు కావాల్సిందే అంటుందట.
చేసేది ఏమిలేక ఆమె అడిగినంత ఇవ్వడానికి మేకర్స్ కూడా రెడీ అయిపోతున్నారు. రామ్ చరణ్ – శంకర్ తీస్తున్న సినిమాకి ఈ భామ నాలుగున్నర కోట్లు డిమాండ్ చేసింది. పాన్ ఇండియా చిత్రం కాబట్టి ఆమె అడిగినంత ఇవ్వడానికి దిల్ రాజ్ కూడా ఒప్పుకున్నాడు. పాపం దిల్ రాజు. ఒక హీరోయిన్ కి ఇంత రెమ్యునరేషన్ ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇక ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమాలో కూడా కియారా అద్వానీని అడిగారు. వాళ్ళు కూడా అంత ఇచ్చుకోవాల్సిందే.