https://oktelugu.com/

పది పాసైన వాళ్లకు శుభవార్త.. పోస్టల్ ఏజెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..?

భారతీయ తపాలా శాఖ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు చెప్పింది. తపాలా జీవిత బీమా పాలసీలు సేకరించటానికి ఏజెంట్ల నియామకం కొరకు దరఖాస్తులను ఆహ్వానించడానికి సిద్ధమైంది. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ హైదరాబాద్ నగరానికి చెందిన వాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కీలక సూచనలు చేశారు. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు తపాలా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 2, 2021 / 04:25 PM IST
    Follow us on

    భారతీయ తపాలా శాఖ నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు చెప్పింది. తపాలా జీవిత బీమా పాలసీలు సేకరించటానికి ఏజెంట్ల నియామకం కొరకు దరఖాస్తులను ఆహ్వానించడానికి సిద్ధమైంది. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ హైదరాబాద్ నగరానికి చెందిన వాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కీలక సూచనలు చేశారు. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

    ఈ ఉద్యోగ ఖాళీలకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్, దివాన్ దేవడి, హైదరాబాద్-02 లో దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వారు ఆగస్టు 12, 13 తేదీలలో ఉదయం 10 గంటలకు సంబంధిత సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు మాజీ సైనికులు, నిరుద్యోగులు, స్వీయ వృత్తులు చేపట్టేవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

    అనుభవంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవాళ్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వారు 5,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ గా చెల్లించాలి. తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్ ఆఫీస్‌ ను సంప్రదించి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.

    హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్ ను సంప్రదించి ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.