
దేశంలో బంగారం ధరలు కొన్ని రోజులు తగ్గుతుంటే మరి కొన్ని రోజులు పెరుగుతున్నాయి. బంగారంధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూ ఉండటంతో బంగారం కొనుగోలు చేసేవాళ్లు ధరల విషయంలో అవగాహన కలిగి ఉండాలి. అవగాహన లేకుండా బంగారం కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తే నష్టపోతే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేడు దేశీయ మార్కెట్ లో బంగారం ధర ఏకంగా 160 రూపాయలు పెరిగింది.
ఏపీలోని విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 46,090 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 42,250 రూపాయలుగా ఉంది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని చెప్పవచ్చు. ఇకపోతే ఇకపై బంగారం కొనుగోలు చేసేవాళ్లు బీఐఎస్ హాల్ మార్క్ ఉన్న బంగారం మాత్రమే కొనాలి. కేంద్ర ప్రభుత్వం బంగారు ఆభరణాలకు హాల్ మార్క్ ను తప్పనిసరి చేసింది.
2021 సంవత్సరం జూన్ నెల 1వ తేదీ తరువాత బీఐఎస్ హాల్ మార్క్ లేని బంగారం కొనడం లేదా అమ్మడం సాధ్యం కాదు. బంగారం స్వచ్చత 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్లలో ఉంటుంది. బీఐఎస్ హాల్ మార్క్ ఉండటం వల్ల అటు బంగారం వ్యాపారులతో పాటు కొనేవాళ్లకు ప్రయోజనం చేకూరుతుంది. స్వచ్ఛమైన బంగారానికి హాల్ మార్కింగ్ నిదర్శనం కాగా మన దేశం ప్రతి సంవత్సరం 700 నుంచి 800 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటోంది.
బంగారం వ్యాపారులు ఆన్ లైన్ ద్వారా సులభంగా బీఐఎస్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకోవచ్చు. www.manakonline.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి బీఐఎస్ యొక్క రిజిష్టర్డ్ జ్యూవెలర్ అయ్యే అవకాశం ఉంటుంది.