చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీకి తొలిపంచ్..

ఏపీ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు టీడీపీకి గట్టిషాక్ ఇస్తున్నారు. ఏకగ్రీవాలు కాకుండా ఓ వైపు టీడీపీ తీవ్ర ఒత్తిడి తీసుకొస్తుండగా.. వైసీపీ నాయకులు వీటిని ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఎన్నికలు ప్రారంభం అయిన తొలిరోజే ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఏకగ్రీవ పంచాయతీలుగా నిలిస్తే.. సర్కారు అందించే నజరానా.. ప్రోత్సాహకలకు ముగ్దులవుతున్న ప్రజలు పల్లెల్లో సీఎం జగన్ మాటకు బాటలు వేస్తున్నారు. ఈ క్రమంలో తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వందకు పైగా గ్రామాలను ఏక్రగీవం […]

Written By: NARESH, Updated On : January 29, 2021 9:28 pm
Follow us on

ఏపీ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు టీడీపీకి గట్టిషాక్ ఇస్తున్నారు. ఏకగ్రీవాలు కాకుండా ఓ వైపు టీడీపీ తీవ్ర ఒత్తిడి తీసుకొస్తుండగా.. వైసీపీ నాయకులు వీటిని ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఎన్నికలు ప్రారంభం అయిన తొలిరోజే ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఏకగ్రీవ పంచాయతీలుగా నిలిస్తే.. సర్కారు అందించే నజరానా.. ప్రోత్సాహకలకు ముగ్దులవుతున్న ప్రజలు పల్లెల్లో సీఎం జగన్ మాటకు బాటలు వేస్తున్నారు. ఈ క్రమంలో తొలిరోజే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు వందకు పైగా గ్రామాలను ఏక్రగీవం కావడం విశేషం.

అయితే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను అడ్డుకోవాలని యత్నిస్తున్న టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతు న్నాయి. పంచాయతీ ఎన్నికలల్లో ఆ పార్టీ తరఫున బరిలో నిలిచేందుకు అభ్యర్థలు దొరకడం లేదు. దీంతో తమ పార్టీలోని నాయకుల్లో ఒకరిద్దరిని బరిలో నిలవాలని జిల్లా నాయకులు కోరుతున్నారు. వారు కూడా కాదనడంతో తెలుగు తమ్ముళ్లు దిక్కు తోచని స్థితిలో పడుతున్నారు. మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే.. నామినేషన్ల పత్రాలు తామే తెస్తామని అంటున్నారు. నామినేషన్ కు సంబంధించిన ఫీజును తామే చెల్లిస్తామని ఆఫర్లు కురిపిస్తున్నారు. ప్లీజ్ మా పార్టీ నుంచి పోటీ చేయండంటూ బతిమిలాడుతున్నారు. అయితే వీటితో పాటు ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చు మొత్తం మీరు చెల్లిస్తేనే పోటీలో నిలబడతామని అరకొరగా ఉన్న టీడీపీ కార్యకర్తలు తేల్చి చెబుతున్నారు. దీంతో టీడీపీ జిల్లా నాయకులు తలలు పట్టుకుంటున్నారు. అధిష్టానం చెప్పిన ప్రకారం.. అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడం ఎలా అని దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కనీసం కొన్ని స్థానాల్లో అయినా తమ అభ్యర్థులను నిలబెట్టేలా నానా తంటాలు పడుతున్నారు.

రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టింది. దీంతో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తు లబ్ధి పొందారు. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ అభిమానులకే మద్దతు పలుకుతున్నారు. ప్రతిపక్ష టీడీపీ మద్దతుతో పోటీ చేసేందుకు ప్రస్తుతం ఎవరూ ముందుకు రాని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. దంతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

అయితే ఎన్నికల ప్రక్రియ తొలిరోజే టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు స్వయానా తన చిత్తూరు సొంత జిల్లా ప్రజలు. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ప్రచారం చేస్తున్న ఏకగ్రీవ నజరానాకు ముగ్ధులయ్యారు. చంద్రబాబు నాయుడు సొంతజిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం సోమల్ల మండలంలోని పదిహేను గ్రామాలకు పదిహేను గ్రామాల్లో వైసీపీ మద్దతుదారులను ఏకగ్రీవ సర్పంచులుగా ఎన్నుకున్నారు. స్వయానా ప్రతిపక్షనేత సొంత జిల్లాలోనే పరిస్థతి ఇలా ఉంటే మిగితా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.