పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నట్లు దర్శకుడు హరీష్ శంకర్ ప్రకటించారు. ప్రస్తుతం పవన్ పింక్ రీమేక్ షూటింగ్లో బీజీగా ఉన్నారు. ఈ మూవీలో తొలిసారి లాయర్ గా నటిస్తున్నాడు. పింక్ మూవీకి తెలుగు టైటిల్ ‘వకీల్ సాబ్’ ఖరారైనట్లు సమాచారం. ఈ మూవీ తర్వాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కించే పిరియాడికల్ మూవీలో నటించనున్నాడు. ఈ రెండు మూవీల అనంతరం పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది.
గబ్బర్ సింగ్ తరహాలోనే కమర్షియల్ మూవీని తెరకెక్కించేందుకు కథను దర్శకుడు హరీష్ శంకర్ సిద్ధం చేసుకున్నాడు. ఈ కథ నచ్చడంతో పవన్ కల్యాణ్ హరీష్ శంకర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా పనులు ప్రారంభం కానున్నట్లు స్వయంగా దర్శకుడు హరీష్ శంకర్ ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఓ మూవీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే చిరంజీవి కోసం రాసుకున్న కథను విన్పించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ మూవీకి ‘ఆచార్య’ అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఈ మూవీలో చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అలాగే నిర్మాత రాంచరణ్ ఈ మూవీలో నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ మూవీ తర్వాత చిరంజీవి ‘లూసీఫర్’ రీమేక్ లో నటిస్తారని తెలుస్తోంది. అప్పటివరకు దర్శకుడు హరీష్ శంకర్-పవన్ కల్యాణ్ కాంబినేషన్లలో వచ్చే మూవీ పూర్తి చేయాలని చూస్తున్నారు. దాదాపు ఈ మూవీలు ఒకే సమయానికి పూర్తయ్యే అవకాశం ఉండటంతో వీరిద్దరి కాంబినేషన్లలో సినిమా రానున్నట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ తొలిసారి మెగాస్టార్ తో సినిమా చేస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.