https://oktelugu.com/

అమెరికాలో ఎమర్జెన్సీ.. ట్రంప్ సంచలన నిర్ణయం

ఇటీవల అమెరికన్ క్యాపిటల్ భవనంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడులు చేయడం.. కాల్పులు జరపడం.. పలువురు మరణించడంతో అమెరికాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు దాడికి పాల్పడిన తన మద్దతుదారులను ట్రంప్ యే ఉసిగొల్పాడని ఆరోపిస్తూ డెమోక్రాట్లు ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. Also Read: వీళ్లకే తొలి టీకాలు.. ధర ఎంతంటే? దీంతోపాటు తాజాగా అమెరికన్ ఎఫ్.బీ.ఐ సంచలన హెచ్చరికలు జారీ చేసింది. రాజధానిలోని క్యాపిటల్ భవనంతోపాటు అన్నిరాష్ట్రాల రాజధానుల్లోని క్యాపిటళ్లపై దాడికి […]

Written By: , Updated On : January 12, 2021 / 12:37 PM IST
Follow us on

Trump

ఇటీవల అమెరికన్ క్యాపిటల్ భవనంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడులు చేయడం.. కాల్పులు జరపడం.. పలువురు మరణించడంతో అమెరికాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు దాడికి పాల్పడిన తన మద్దతుదారులను ట్రంప్ యే ఉసిగొల్పాడని ఆరోపిస్తూ డెమోక్రాట్లు ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు.

Also Read: వీళ్లకే తొలి టీకాలు.. ధర ఎంతంటే?

దీంతోపాటు తాజాగా అమెరికన్ ఎఫ్.బీ.ఐ సంచలన హెచ్చరికలు జారీ చేసింది. రాజధానిలోని క్యాపిటల్ భవనంతోపాటు అన్నిరాష్ట్రాల రాజధానుల్లోని క్యాపిటళ్లపై దాడికి కుట్ర జరుగుతోందని ఎఫ్.బీ.ఐ హెచ్చరించింది. కొత్త అధ్యక్షుడు బైడెన్ ప్రమాణస్వీకారానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఘర్షణలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ క్రమంలోనే కట్టుదిట్టమైన భద్రత అవసరం అని అత్యవసర పరిస్థితి అనివార్యం అని అధ్యక్షుడు ట్రంప్ కు వివరించింది.

ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో 9 రోజుల్లోనే దిగిపోతుండగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని వాషింగ్టన్ డీసీ ప్రాంతాల్లో ఎమర్జెన్సీని విధించారు. జనవరి 20న బైడెన్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎమర్జెన్సీ విధించాలన్న వాషింగ్టన్ మేయర్ బౌసర్ సిఫార్సు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Also Read: నేను రాను.. నన్ను ఇబ్బంది పెట్టకండి : మరోసారి క్లారిటీ ఇచ్చిన రజనీ

క్యాపిటల్ భవనంపై దాడి తర్వాత అమెరికాలో ఉద్రికత్తలు తగ్గడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో బైడెన్ ప్రమాణ స్వీకారం నాడు భారీ అల్లర్లకు ప్లాన్ జరుగుతోందన్న ఎఫ్.బీ.ఐ సూచన మేరకు ట్రంప్ ఏకంగా ఎమర్జెన్సీ విధించారు. హోంలాండ్ సెక్యూరిటీ, ఎఫ్ఈఎంఏ బలగాలను, కేంద్ర బలగాలను రంగంలోకి దించి దేశవ్యాప్తంగా వారికి అధికారాలు కల్పించారు.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు