https://oktelugu.com/

కేసీఆర్ పై సంచలన కామెంట్స్ చేసిన డీకే అరుణ..!

గడిచిన ఆరేళ్లుగా తెలంగాణలో టీఆర్ఎస్ హవా కొనసాగింది. అయితే కొంతకాలంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మారుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతోన్నాయి. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవడంతో అందరిచూపు ఆ పార్టీ వైపు పడింది. అదేవిధంగా ఆ వెంటనే వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. దీంతో బీజేపీలోకి వలసలు మొదలయ్యాయి. ఈక్రమంలోనే బీజేపీ.. టీఆర్ఎస్ మధ్య గత కొంతకాలంగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 3, 2021 7:14 pm
    Follow us on

    గడిచిన ఆరేళ్లుగా తెలంగాణలో టీఆర్ఎస్ హవా కొనసాగింది. అయితే కొంతకాలంగా రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మారుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతోన్నాయి.

    దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవడంతో అందరిచూపు ఆ పార్టీ వైపు పడింది. అదేవిధంగా ఆ వెంటనే వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. దీంతో బీజేపీలోకి వలసలు మొదలయ్యాయి.

    ఈక్రమంలోనే బీజేపీ.. టీఆర్ఎస్ మధ్య గత కొంతకాలంగా మాటలయుద్ధం కొనసాగుతోంది. బీజేపీ నేతలు టీఆర్ఎస్ సర్కార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నా ఆపార్టీ నేతలు తిప్పికొట్టలేకపోతున్నారు. ఈక్రమంలోనే బీజేపీ నాయకురాలు డీకే అరుణ సీఎం కేసీఆర్ పై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.

    కేసీఆర్ యూటర్న్ ముఖ్యమంత్రిగా మారిపోయారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అవసరం లేదన్న కేసీఆర్ నేడు యూ టర్న్ తీసుకుంటున్నాడని తెలిపారు. కేంద్రం రైతు రైతు వ్యతిరేక చట్టాలు చేసిందని.. రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు చేశారని.. ఆ తర్వాత మళ్లీ యూటర్న్ తీసుకొని కేంద్రానికి జై కొట్టాడని తెలిపారు. .

    ధరణి అన్నాడు.. మళ్లీ యూ టర్న్ తీసుకున్నాడని ఎద్దేవా చేశారు. మొన్నటి దుబ్బాక.. గ్రేటర్ ఫలితాల తర్వాత కేసీఆర్ మెల్కొంటున్నాడని ఆమె అన్నారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలు.. నాయకులను బెదిరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

    బీజేపీ కార్యకర్తలకు తాను అండగా ఉంటాయని రాబోయే ఎన్నికల్లోనూ బీజేపీ హవానే కొనసాగుతుందని డీకే అరుణ స్పష్టం చేశారు. డీకే అరుణ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్టవుతారో వేచిచూడాల్సిందే..!