అమ్మ ఒడిని మించిన పథకం తెస్తున్న సీఎం జగన్

‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ అనే నినాదంతో ఇప్పటికే ప్రజల మదిలో గూడు కట్టుకున్న జగనన్న.. నవరత్నాల మేనిఫెస్టోలో చేర్చిన ప్రతీ పథకాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. మేనిఫెస్టోలో చేర్చినవే కాకుండా అంతకు మంచి.. అంటూ ప్రజలకు అవసరం ఉన్న పథకాలన్నీ ప్రవేశ పెడుతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సీఎం పదవిని చేపట్టిన 20 నెలల వ్యవధిలోనే ఎన్నో అత్యున్నత పథకాలను ప్రజల మధ్యకు చేర్చి జయహో జగనన్న అనిపించుకున్నారు. ప్రజలకు చెప్పినవే కాదు.. పాదయాత్రలో […]

Written By: NARESH, Updated On : January 23, 2021 4:43 pm
Follow us on

‘నేను ఉన్నాను.. నేను విన్నాను’ అనే నినాదంతో ఇప్పటికే ప్రజల మదిలో గూడు కట్టుకున్న జగనన్న.. నవరత్నాల మేనిఫెస్టోలో చేర్చిన ప్రతీ పథకాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. మేనిఫెస్టోలో చేర్చినవే కాకుండా అంతకు మంచి.. అంటూ ప్రజలకు అవసరం ఉన్న పథకాలన్నీ ప్రవేశ పెడుతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సీఎం పదవిని చేపట్టిన 20 నెలల వ్యవధిలోనే ఎన్నో అత్యున్నత పథకాలను ప్రజల మధ్యకు చేర్చి జయహో జగనన్న అనిపించుకున్నారు. ప్రజలకు చెప్పినవే కాదు.. పాదయాత్రలో చూసిన సమస్యలకు కూడా పరిష్కరాన్ని చూపారు.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మెహన్ రెడ్డి.

Also Read: కొత్త కారు కొనాలనుకునే వారికి షాక్.. మళ్లీ పెరిగిన ధరలు..?

ప్రతీ సమాజానిక వర్గానికి పెద్దపీట వేశారు. ప్రతీ కులానికి అవసరమైన సదుపాయాలు కల్పించారు. ముఖ్యంగా పిల్లల చదువు విషయంలో జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న శ్రద్ధ అంతాఇంతా కాదు.. అమ్మ ఒడి పథకం దేశంలోనే ఎంతో ఖ్యాతిని సంపాదించింది. ఇటీవల జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఏపీ విద్యాశాఖ్య మంత్రి ఈ అంశంపై ప్రసంగించగా.. ఎంతో మంది అంతర్జాతీయ స్థాయి మేథావులు.. అమ్మ ఒడిని ఎంతో అభినందించారు. ఇటీవల అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమంలోనూ సీఎం ఓ మాట చెప్పారు. చదువుకునే ప్రతీ విద్యార్థికి ఏడాదికి రూ.15000 వేలు ఇస్తున్నాం… డబ్బులు వద్దన్నవారికి ల్యాప్ టాప్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయమై ఆలోచించిన జగన్ మోహన్ రెడ్డి మరో భారీ పథకానికి శ్రీకారం చుడుతున్నారు.

రాష్ట్రంలో అన్ని గ్రామాలకు అంతరాయం లేని నిరంతర ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా నెట్ వర్క వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఊరిలో ఉన్న నెట్ వర్క్ పాయింట్ నుంచి ఇంటింటికీ ఇంటర్ నెట్ కనెక్షన్ ఇవ్వాలని సూచించారు. వినియోగదారులు ఏ సామర్థ్యం మేరకు కనెక్షన్ కావాలన్నా.. ఇచ్చేలా సిద్ధంగా ఉండాలని తెలిపారు. గ్రామాల్లో ఇంటర్ నెట్ కనెక్షన్లు.. అమ్మఒడి పథకంలో డబ్బులు వద్దనుకునే వారికి ఇచ్చే ల్యాప్ టాప్ ల పంపిణీపై ఉన్నతస్థాయిలో సమీక్షించారు. వచ్చే ఏడాది ‘అమ్మ ఒడి’ చెల్లింపుల నాటికి డబ్బలు వద్దన్న వారికి ల్యాప్ టాప్ లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ప్రతీ గ్రామానికి అన్ లిమిటెడ్ ఇంటర్ నెట్ సదుపాయం కల్పించేలా వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Also Read: ప్రశ్నిస్తే చంపేస్తారా? నిన్ను తొక్కేస్తా వైసీపీ ఎమ్మెల్యే.. జనసైనికుడి కుటుంబానికి పవన్ పరామర్శ

ఇంటర్ నెట్ కేబుళ్లు తెగిపోయి.. అవాంతరాలు వచ్చే పరిస్థితి రాకూడదని.. అలాంటి సమస్యలను వేగంగా అధిగమించేలా చర్యలు తీసుకుంటూ.. ఆ వ్యవస్థను తీర్చిదిద్దాలని సూచించారు. అదే విధంగా వైఎస్సార్ జగనన్న కాలనీల్లోకి కూడా ఇంటర్ నెట్ సదుపాయం తీసుకురావాలని సూచించారు. ఈ మేరకు వేగంగా ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. హెచ్ టీ లైన్ నుంచి సబ్ స్టేషన్ వరకు సబ్ స్టేషన్నుంచి పంచాయతీల అండర్ గ్రౌండ్ వరకు కేబుళ్లు తీసుకుపోయే ఆలోచనతో ముందుకు సాగాలని తెలిపారు. ప్రతీ గ్రామ పంచాయతీకి వేగంగా ఇంటర్ నెట్ సదుపాయం అందించేలా చర్యలు వేగంగా చేయాలని ఈ సమీక్షలో వివరించారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్