https://oktelugu.com/

బ్రేకింగ్: తిరుపతి, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

సమయం లేదిక.. పెండింగ్ లో ఉన్న నాగార్జున సాగర్, తిరుపతిలో గెలుపు ఎవరిదో తేలనుంది. తెలుగు రాజకీయాలను ప్రభావితం చేసే నాగార్జున సాగర్, తిరుపతి ఉప ఎన్నికకు వేళైంది. కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితమే ఈ రెండు స్తానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. నిజానికి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు నాగార్జునసాగర్, తిరుపతి ఉప ఎన్నికకు షెడ్యూల్ ప్రకటిస్తారని అనుకున్నారు. అయితే అప్పటికే తెలంగాణ, ఏపీలో పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు […]

Written By:
  • NARESH
  • , Updated On : March 16, 2021 5:41 pm
    Follow us on

    AP Municipal Elections 2021

    సమయం లేదిక.. పెండింగ్ లో ఉన్న నాగార్జున సాగర్, తిరుపతిలో గెలుపు ఎవరిదో తేలనుంది. తెలుగు రాజకీయాలను ప్రభావితం చేసే నాగార్జున సాగర్, తిరుపతి ఉప ఎన్నికకు వేళైంది. కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితమే ఈ రెండు స్తానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది.

    నిజానికి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు నాగార్జునసాగర్, తిరుపతి ఉప ఎన్నికకు షెడ్యూల్ ప్రకటిస్తారని అనుకున్నారు. అయితే అప్పటికే తెలంగాణ, ఏపీలో పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించిన కోడ్ అమలులో ఉండటంతో.. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించలేదు. రెండు రోజుల క్రితం ఈ ఎన్నికలు అయిపోవడంతో తాజాగా నాగార్జునసాగర్‌తో పాటు ఏపీలోని తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

    తెలంగాణలోని నాగార్జున సాగర్ కు, తిరుపతి ఎంపీ స్థానానికి ఒకే సారి నోటిఫికేషన్, ఎన్నిక నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది.

    ఏప్రిల్ 17న ఏపీలో తిరుపతి లోక్ సభ స్థానంతో పాటు నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇక ఈ ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు మే 2న జరగనుంది. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి మార్చి 23న ఎన్నికల సంఘం నోటిపికేషన్ విడుదల చేయనుంది. ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 31న నామినేషన్లను పరిశీలిస్తారు. ఏప్రిల్ 3న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు.

    ఏప్రిల్ 17న పోలింగ్ జరగనుండగా.. తమిళనాడు, అసోం, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరితో పాటు మే 2న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఫలితాలు రానున్నాయి.