ఓ సారి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, కేసీఆర్‌తో తలపడటానికి బాహుబలి రావాలంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దుబ్బాక ఫలితంతో ఇప్పుడు సమాధానం దొరికిందని కొందరు అనుకుంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బండి సంజయ్ చేసిన ప్రచారం బీజేపీకి బాగా కలిసొచ్చింది. దీంతో తెలంగాణకు బండి సంజయ్ రూపంలో బహుబలి దొరికడని అనుకుంటున్నారు. బండి సంజయ్ అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలలో కేంద్రం ఇస్తున్న వాటా గురించి ఓటర్లకు అర్థమయ్యేలా అవగాహన కల్పించడంలో విజయం సాధించారు.
Also Read: మద్యం తాగేవారికి షాకింగ్ న్యూస్.. పదేళ్లు జైలు శిక్ష..?
బీజేపీ అధిష్ఠానం కరడుగట్టిన ఆరెస్సెస్ వాది అయిన బండి సంజయ్‌కు అధ్యక్ష పదవిని కట్టబెట్టింది, పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. దీంతో అతడు దుబ్బాక ఉపఎన్నికల్లో దూకుడుగా ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు సంజయ్ వ్యవహారశైలిపైనే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడిఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది.
హైదరాబాద్ వరదల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఉంది. దీంతో బీజేపీ బండి సంజయ్ నాయకత్వంలో దూకుడుగా ప్రచారం చేయాలని చూస్తోంది. బలమైన ప్రత్యామ్నాయంగా బీజేపీ స్పష్టంగా కనబడుతుండటంతో ఇతర పార్టీలనుంచి చేరికలకు పెద్దసంఖ్యలో అవకాశం ఉందని తెలుస్తోంది. కేసీఆర్‌కు దీటైన ప్రత్యామ్నాయం ఉందని తెలంగాణ ప్రజలలో నమ్మకం కలగజేయడంలో బీజేపీ నాయకులు సక్సెస్ అయ్యారు.. ఉద్యోగాల భర్తీ విషయంలో కేసీఆర్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న యువత దుబ్బాకలో బీజేపీ విజయం కోసం పనిచేసింది.
Also Read: చదువులకు బ్రేక్: ఇంటర్ క్లాసులు మళ్లీ వాయిదా
రాష్ట్రంలో రాజకీయసమీకరణాలలో సమూలమైన మార్పులకు దుబ్బాక ఫలితం నాంది పలికిందని అనుకుంటున్నారు. నాలుగు పార్లమెంట్ స్థానాలలో బీజేపీ విజయఢంకా మోగించినప్పుడే కేసీఆర్ మేలుకుని ఉండాల్సిందని కొందరి వాదన. ఆయన అదేమీ పట్టించుకోకుండా తనదైన పోకడలతోనే పాలన కొనసాగించారు. దీంతో బండి సంజయ్ కేసీఆర్ పాలన లోపాలను ఎత్తిచూపుతూ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగారు. దీంతో ప్రజలు తెలంగాణ బహుబలి బండి సంజయ్ అని అనుకుంటున్నారు.