ఓరుగల్లులో ‘బండి’ దూసుకెళ్లనుందా?

తెలంగాణలో గడిచిన ఆరేళ్లుగా దూసుకెళుతున్న కారు స్పీడుకు బీజేపీ సడెన్ బ్రేక్ వేసింది. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. దీని నుంచి కోలుకోవడానికి సీఎం కేసీఆర్ ముందస్తుగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లినా పెద్దగా ఫలితం రాలేదు. గ్రేటర్లోనూ బీజేపీ హవా కొనసాగింది. దీంతో గ్రేటర్లో హంగ్ ఏర్పడింది. Also Read: కేసీఆర్, జగన్ ఢిల్లీ టూర్స్: ఏపీ, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్జిస్ ల బదిలీలు? గత రెండు ఎన్నికల్లోనూ […]

Written By: Neelambaram, Updated On : December 15, 2020 10:14 am
Follow us on

తెలంగాణలో గడిచిన ఆరేళ్లుగా దూసుకెళుతున్న కారు స్పీడుకు బీజేపీ సడెన్ బ్రేక్ వేసింది. దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. దీని నుంచి కోలుకోవడానికి సీఎం కేసీఆర్ ముందస్తుగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లినా పెద్దగా ఫలితం రాలేదు. గ్రేటర్లోనూ బీజేపీ హవా కొనసాగింది. దీంతో గ్రేటర్లో హంగ్ ఏర్పడింది.

Also Read: కేసీఆర్, జగన్ ఢిల్లీ టూర్స్: ఏపీ, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్జిస్ ల బదిలీలు?

గత రెండు ఎన్నికల్లోనూ బీజేపీ సత్తాచాటి టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని చాటింది. ఇక త్వరలో జరిగే వరంగల్.. ఖమ్మం కార్పొరేషన్.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. నాగార్జున్ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ సత్తాచాటాలని ఉవ్విళ్లురుతోంది. ఈక్రమంలోనే బీజేపీ ఉద్యమాల పురిటిగడ్డ అయినా ఓరుగల్లుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.

త్వరలోనే వరంగల్ కార్పొరేషన్.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో టీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలపై బీజేపీ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పదిమంది కార్పొరేటర్లు బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని టాక్. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు.. శాప్ మాజీ డైరెక్టర్ రాజనాల శ్రీహరి బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి సీటు ఆశిస్తున్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది. ఆయనకు సన్నహితంగా ఉన్న మరో ఏడుగురు కార్పొరేటర్లు బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. దీంతో మంత్రులు.. ఎమ్మెల్సీలు రంగంలోకి దిగి ప్రదీప్ వెంట కార్పొరేటర్లు వెళ్లకుండా బుజ్జగింపులు చేస్తున్నారు.

Also Read: రేవంత్ యాక్షన్ ప్లాన్ ముందుగానే రెడీ అయిందా?

త్వరలోనే బండి సంజయ్ వరంగల్లో మూడురోజులపాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలోనే ప్రదీప్ రావు.. రాజనాల శ్రీహరిలు కాషాయ కండువా కప్పుకోబోతున్నారని టాక్ విన్పిస్తోంది. వరంగల్ తూర్పు సీటు ఆశిస్తున్న ప్రదీప్ రావు తన బలాన్ని వీలైనంతగా చూపించాలని భావిస్తున్నారట. దీంతో ఆయనతోపాటు భారీగా చేరికలు ఉంటాయని తెలుస్తోంది.

ఇక వరంగల్ పశ్చిమంలోని బీజేపీ గాలి వీస్తుందని టాక్ విన్పిస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీలో చేరుతున్నారు. ఓరుగల్లులోని బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపేలా బండి సంజయ్ పర్యటన ఉండబోతుందని సమాచారం. మూడురోజులు ఈ ప్రాంతంలోనే బస చేసి కలిసొచ్చే నేతలను పార్టీలో చేర్చుకోబోతున్నారని టాక్.

ఇక రాబోయే ఎన్నికల్లో సత్తాచాటేలా దిశనిర్దేశం చేయబోతున్నారు. దీంతో బీజేపీ శ్రేణులు సైతం ఆయన పర్యటనకు ఇప్పటి నుంచే సన్నహాలు చేసుకుంటున్నాయి. దీంతో ఓరుగల్లులో ‘బండి’ దూసుకెళ్లడం ఖాయమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్