AP Leaders Audio Leaks: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అధికార పార్టీ వైసీపీలో ఆడియో లీకులు అందరని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఒకరి వెంట ఒకరివి బయట పడుతుంటే నేతలలో కలవరం మొదలైంది. అవినీతి, అక్రమాల్లో అయితే ప్రజలు పెద్దగా పట్టించుకోరు. కానీ రాసలీలల్లో మునిగి తేలితే మాత్రం క్షమించరు. ఈ మధ్య ఏపీలో నేతల తీరుపై సామాజిక మాధ్యమాల్లో ఆడియో లీకుల వ్యవహారాలు అందరిని భయపెడుతున్నాయి. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆడియో లీకులు బయటకు రావడం సంచలనంగా మారుతోంది.
ఒకసారి జరిగితే పొరపాటు కానీ ప్రతిసారి జరిగితే మాత్రం అదే అలవాటు అన్నట్లుగా ఉంటుంది. ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్నది అదే. ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకరి వెంట మరొకరిపై ఆడియో లీకుల వ్యవహారం చుట్టుకుంటోంది. దీంతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోంది. నాయకుల భవితవ్యం మసకబారుతోంది. ఇప్పటికే గతంలోనే థర్డీ ఇయర్స్ ఇండస్రీ పృధ్వీపై ఆరోపణలు వచ్చాయి. అదే విధంగా మరో ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఇప్పుడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఇలా ఒకరి వెంట మరొకరి రాసలీలలు బయటపడటం పార్టీ ప్రతిష్టపై పెను ప్రభావం చూపిస్తుందని నేతలు చెబుతున్నారు.
వైసీపీలో ఇలా మచ్చలు తెస్తున్న రాజకీయ నేతలతో పార్టీ అధినేతకే తుది ఫలితం దక్కే విధంగా తయారయ్యే పరిస్థితి ఎదురవబోతోందని తెలుస్తోంది. నేతల మీద ఉన్న నమ్మకంతో జగన్ వారికి పదవులు కట్టబెట్టినా వారు తప్పుడు దారిలో నడుస్తూ తమ ప్రతిష్టతో పాటు పార్టీకి కూడా నష్టం చేసే మార్గంలో పయనిస్తున్నారని పార్టీ నేతలే తమ అభిప్రాయాలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో వీరి ఆడియో బాగోతాలు వైరల్ కావడంతో పార్టీ భవితవ్యం మీదే ప్రభావం చూపించొచ్చని తెలుస్తోంది.
రాజకీయాల్లో అవినీతికి పాల్పడిన వారిని మాత్రం మూమూలుగానే చూస్తున్న నేటి రోజుల్లో అసభ్య ప్రవర్తనకు పాల్పడితే మాత్రం క్షమించరు. దీంతో వైఎస్ జగన్ చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. మహిళలతో నేతల రాసలీలు పార్టీలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వం దిశ లాంటి చట్టాలు తెస్తున్నా సొంత పార్టీ నేతలు తప్పు చేయడం పార్టీ ప్రతిష్ట దిగజార్చే విధంగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆడియో లీకులపై అధినేత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నేతలు చెబుతున్నారు. సీరియల్ గా వస్తున్న కథనాలతో పార్టీ భవిష్యత్ కు ఆటంకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పార్టీ గట్టెక్కడం కష్టమే. ఈ నేపథ్యంలో జగన్ వీటి తీరుపై ప్రత్యేక దృష్టి సారించి వారి ఆగడాలను అడ్డుకోవల్సిన అవసరం గుర్తించి పార్టీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత తీసుకోవాలని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.