పార్లమెంట్.. అసెంబ్లీలకు వెళ్లే నేతలు ఎంతో హుందాగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రజా సమస్యలను ఆయా సభల్లో విన్పించి పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో పార్లమెంట్.. అసెంబ్లీలకు ఎన్నికైన నేతలు వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉండటం చర్చనీయాంశంగా మారుతోంది. క్రైమ్ నేపథ్యం ఉన్నవారే ఇటీవల చట్టసభలకు వెళుతుండటంతో ఆయా సభమర్యాదలు గంగపాలు అవుతున్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
Also Read: రైతులకు అలర్ట్.. ఈ పంటతో ఏడాదికి రూ.20 లక్షల ఆదాయం..?
లోభసభ.. రాజ్యసభలో నేతలు వ్యవహరిస్తూనే తీరేకాకుండా.. తెలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ.. శాసన మండలిలో నేతలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయనే ఆందోళన కలుగుతోంది. నేతలు ప్రజా సమస్యల పరిష్కారం కంటే కూడా వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యం ఇస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు రాజకీయ నేతలు బయట ఎలా ఉన్నా.. చట్టసభల్లో మాత్రం హుందాగా వ్యవహరించేవారు. ప్రస్తుత నేతల్లో మాత్రం అది కొరవడినట్లు స్పష్టంగా కన్పిస్తోంది.
తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతోంది. ఐదురోజులపాటు జరిగే ఈ అసెంబ్లీ సమావేశాలు గత రెండ్రోజులుగా వాడివేడీగా సాగుతున్నాయి. అధికారంలోని వైసీపీ.. ప్రతిపక్షంలోని టీడీపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. నువ్వంతా అంటే నువ్వేంతా అని నేతలు వాగ్వావాదానికి దిగుతున్నారు. ఒకనొక సమయంలో నేతలు సహనం కోల్పోయి వ్యక్తిగత దూషణలకు పాల్పడుతుండటం శోచనీయంగా మారుతోంది.
Also Read: జగన్ ధాటికి చంద్రబాబు రాజకీయ సన్యాసమేనా?
ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్య మాటలతుటాలు పేలుతున్నారు. చంద్రబాబు ఒకటి అంటే జగన్మోహన్ రెడ్డి పది మాటలు అంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీ సంయమనం పాటించాల్సి సభను ముందుకు నడిపించాల్సి ఉండగా ఆపార్టీ నేతలే దూకుడుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. దీంతో అసెంబ్లీలో ప్రజా సమస్యలు పక్కదోవపడుతూ నేతలు వ్యక్తిగత దూషణలు హైలట్ అవుతున్నాయి.
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న టీడీపీ గొంతును వైసీపీ నులిమివేస్తోందని చంద్రబాబు మీడియా సాక్షిగా జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అవుతున్నాడు. దీనికి కౌంటర్ గా వైసీపీ మంత్రులు ఎదురుదాడికి దిగుతున్నారు. చంద్రబాబుపై ఇటీవల కొడాలి నాని మీడియా ముఖంగా విన్పించిన బూతుపురాణం చూడలేక టీవీలు కట్టేసే పరిస్థితి వచ్చిందంటే ఆయన ఎలా మాట్లాడనేది అర్థం చేసుకోవచ్చు. ఆయన ఒక్కడేనే కాదు దాదాపు చాలామంది నేతలు ఇలానే వ్యవహరిస్తుండటం విమర్శలు తావినిస్తోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
నేతలు మరీ దిగజారిపోయిన వ్యక్తిగత దూషణలకు పాల్పడుతుంటంతో ఏపీ రాజకీయం ఎటువైపు వెళుతుందనేది చర్చనీయాంశంగా మారింది. నేతలు ఇలాగే వ్యవహరిస్తే మాత్రం ఏపీ భవిష్యత్ ను నేతలే చేజేతుల అంధకారంలోకి నెట్టివారవుతారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేతలు ఇప్పటికైనా సభ మార్యదను.. సంప్రదాయాలను కాపాడుతూ హుందాగా వ్యవహరించాలని ప్రజాస్వామికవాదులు కోరుతున్నారు.