‘నిశ్శబ్ధం’ ట్రైలర్ టాక్.. అనుష్క మౌనం వెనుక కారణమేంటి?

అడవిలో ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా ఒక ఇల్లు.. పక్కనే నీటి కొలను.. కట్ చేస్తే అందులో ఏదో జరుగుతుంది.. దెయ్యాలు కదిలిన శబ్ధాలు.. అనుష్క, మాధవన్ జంటకు ఓ ఇంట్లో జరిగిన ప్రమాదం.. అనుష్కకు మాటలు పడిపోవడం.. ఆ కేసు తేలకపోవడం.. ఆ మిస్టరీని ఎలా చేధించారన్నది ఉత్కంఠగా ట్రైలర్ లో చూపించారు. సైలెన్స్ కూడా అంత వాయిలెంట్ గా ఉంటుందని ‘నిశ్శబ్ధం’ ట్రైలర్ చూశాక అర్థమైంది.మనం ఎంత సైలెంట్ చూపిస్తే.. ప్రేక్షకుల్లో అంత సస్పెన్స్ క్రియేట్ […]

Written By: NARESH, Updated On : September 21, 2020 9:24 pm
Follow us on

అడవిలో ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా ఒక ఇల్లు.. పక్కనే నీటి కొలను.. కట్ చేస్తే అందులో ఏదో జరుగుతుంది.. దెయ్యాలు కదిలిన శబ్ధాలు.. అనుష్క, మాధవన్ జంటకు ఓ ఇంట్లో జరిగిన ప్రమాదం.. అనుష్కకు మాటలు పడిపోవడం.. ఆ కేసు తేలకపోవడం.. ఆ మిస్టరీని ఎలా చేధించారన్నది ఉత్కంఠగా ట్రైలర్ లో చూపించారు.

సైలెన్స్ కూడా అంత వాయిలెంట్ గా ఉంటుందని ‘నిశ్శబ్ధం’ ట్రైలర్ చూశాక అర్థమైంది.మనం ఎంత సైలెంట్ చూపిస్తే.. ప్రేక్షకుల్లో అంత సస్పెన్స్ క్రియేట్ చేయవచ్చని నిశ్శబ్ధం టీం నిరూపించింది.

Also Read : ప్రభాస్ మూవీపై నాగ్ అశ్విన్ మరో అప్డేట్

కరోనా కారణంగా ఎప్పుడో పూర్తై విడుదలకు నోచుకోలేకపోయిన చిత్రం ‘నిశ్శబ్ధం’. గత ఫిబ్రవరిలోనే థియేటర్లలో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ బహుబాషా చిత్రం కావడం.. ఐదు దక్షిణాది భాషల్లో రిలీజ్ కు ప్లాన్ చేయడంతో లేట్ అయ్యింది. ఆ తరువాత కరోనా వచ్చి ఇప్పుడు తప్పని సరి పరిస్థితుల్లో అమేజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయాల్సి వస్తోంది.

అనుష్క ప్రధానపాత్రలో వస్తున్న ‘నిశ్శబ్ధం’ మూవీ తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం సహా ఇతర భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యి అంచనాలు పెంచేసింది.

మంచు విష్ణుతో ‘వస్తాడు నారాజు’ సినిమా తీసిన దర్శకుడు హేమంత్ మధుకర్ ‘నిశ్శబ్ధం’కు దర్శకత్వం వమించాడు. సినిమా విజువల్స్, ఆర్ఆర్ చూస్తుంటే ఇదో సస్పెన్స్ థ్రిల్లర్ గా కనిపిస్తోంది. అక్టోబర్ 2న అమేజాన్ ప్రైమ్ లో దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.

-నరేశ్