https://oktelugu.com/

టీఆర్ఎస్ వెంటే ఆంధ్రా ఓటర్లు..!

గ్రేటర్ ఎన్నికల వేళ సవాలక్ష సందేహాలు.. ఓటు బ్యాంకు లెక్కలు.. ఎన్నో పంచాయితీలు.. అయినా అన్నింటిని దాటుకొని గ్రేటర్ ఓటరు తీర్పు వెలువడింది. అంతిమంగా గ్రేటర్ లో టీఆర్ఎస్ కే మెజార్టీ సీట్లు దక్కినా బీజేపీ మాత్రం పట్టువదలకుండా ఏకంగా 40 పైచిలుకు స్థానాలు సాధించి టీఆర్ఎస్ కు టఫ్ ఫైట్ ఇచ్చింది. అయితే ఓటింగ్ సరళి చూస్తే మాత్రం ఈసారి కూడా ఆంధ్రా ఓటర్లు తెలంగాణ ఇంటిపార్టీకే జై కొట్టినట్టు తెలుస్తోంది. Also Read: సింగిల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 4, 2020 / 06:15 PM IST
    Follow us on

    గ్రేటర్ ఎన్నికల వేళ సవాలక్ష సందేహాలు.. ఓటు బ్యాంకు లెక్కలు.. ఎన్నో పంచాయితీలు.. అయినా అన్నింటిని దాటుకొని గ్రేటర్ ఓటరు తీర్పు వెలువడింది. అంతిమంగా గ్రేటర్ లో టీఆర్ఎస్ కే మెజార్టీ సీట్లు దక్కినా బీజేపీ మాత్రం పట్టువదలకుండా ఏకంగా 40 పైచిలుకు స్థానాలు సాధించి టీఆర్ఎస్ కు టఫ్ ఫైట్ ఇచ్చింది. అయితే ఓటింగ్ సరళి చూస్తే మాత్రం ఈసారి కూడా ఆంధ్రా ఓటర్లు తెలంగాణ ఇంటిపార్టీకే జై కొట్టినట్టు తెలుస్తోంది.

    Also Read: సింగిల్ డిజిట్: కాంగ్రెస్ కు ఘోర అవమానం

    ఆంధ్రా ఓటర్లు ఎక్కువగా ఉండే కూకట్ పల్లి సర్కిల్ లో తెలంగాణ ఇంటిపార్టీ అధికార టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడం విశేషంగా మారింది. కూకట్ పల్లి పరిధిలోని ఓల్డ్ బోయినపల్లి, బాలానగర్, కూకట్ పల్లి, వివేకానందనగర్ కాలనీ, హైదర్ నగర్ , అల్విన్ కాలనీలో టీఆర్ఎస్ పూర్తి ఆధిక్యంలో కొనసాగుతోంది.

    ఇక్కడే కాదు ఆంధ్రా ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టీఆర్ఎస్ గెలిచింది. దీంతో వారంగా గులాబీ పార్టీకే పట్టం కట్టినట్టు అర్థమవుతోంది. బీజేపీ ఎంత ప్రచారం చేసినా కూడా హైదరాబాదీలు ఆ పార్టీని నమ్మలేదని.. అధికార పార్టీ వైపే చూశారని ట్రెండ్స్ ను బట్టి తెలుస్తోంది.

    Also Read: కాంగ్రెస్ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారా? మాజీ ఎంపీ సంచలన కామెంట్స్

    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు హవా కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ లో వెనుకబడ్డ టీఆర్ఎస్ సాధారణ ప్రజల ఓట్ల వరకు వచ్చేసరికి దూసుకుపోతోంది.ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే టీఆర్ఎస్ కే హైదరాబాద్ ప్రజలు పట్టం కట్టినట్టు తెలుస్తోంది. అయితే బీజేపీని ఏం తక్కువ చేయలేదు.

    పలు డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. ఇప్పటికే మెట్టుగూడలో టీఆర్ఎస్ తొలి విజయం అందుకుంది. దాదాపు 70 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. ఇక మంత్రి తలసాని ప్రాతినిధ్యం వహిస్తున్న సనత్ నగర్ డివిజన్ లో టీఆర్ఎస్ విజయం సాధించింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్