
దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత తీస్తున్న ఈ మూవీపై బోలెడు అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే అమెరికా నుంచి ప్రఖ్యాత యాక్షన్ డైరెక్టర్ ను. 500 మంది ఆర్టిస్టులను తీసుకొచ్చి మరీ రాజమౌలి నభూతో నభవిష్యతి అన్నట్టుగా క్లైమాక్స్ ను తీర్చిదిద్దుతున్నాడు.
అలాగే ప్రతి నటుడి పుట్టిన రోజుకు వారి ఫస్ట్ లుక్ లు రిలీజ్ చేస్తూ అభిమానులకు సర్ ప్రైజ్ ఇస్తున్నాడు. తాజాగా మరో అప్ డేట్ కు రాజమౌళి రెడీ అయ్యాడు.
‘ఆర్ఆర్ఆర్ డైరీస్’ పేరుతో ఇప్పటికే షూటింగ్ కు సంబంధించిన చిన్న చిన్న వీడియోలను రాజమౌళి పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే బాలీవుడ్ అగ్రహీరోయిన్ ఆలియా భట్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లు రాజమౌళి ప్రకటించాడు.
ఆర్ఆర్ఆర్ లో రాంచరణ్ కు జోడీగా ‘సీత’ పాత్రలో ఆలియా భట్ నటిస్తోంది. మార్చి 15న ఆలియా భట్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆరోజు ఉదయం 11 గంటలకు ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇప్పటికే ఓ షెడ్యూల్ లో ఆలియా భట్ పాల్గొంది. మరో షెడ్యూల్ లోనూ ఆలియా పాల్గొననున్నారు. క్లైమాక్స్ తరువాత దీన్ని తెరకెక్కించనున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ లు, టీజర్ లకు మంచి స్పందన రాగా.. ఇప్పుడు ఆలియా భట్ ఫస్ట్ లుక్ కు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 13న దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Meet our #Sita in all her glory. ✨
First look of @Aliaa08 will be revealed on March 15, 11 AM. #RRRMovie #RRR@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @oliviamorris891 @DVVMovies pic.twitter.com/6sYLzfY3Ou
— RRR Movie (@RRRMovie) March 13, 2021