Work From Home: ఇన్నాళ్లు ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం కు అలవాటు పడ్డారు. దీంతో రెండేళ్ల పాటు వర్క్ ఫ్రం హోంకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో సంస్థలు ఉద్యోగుల ఇబ్బందులు గుర్తించి వర్క్ ఫ్రం హోంకే మొగ్గు చూపాయి. హైదరాబాద్, ముంబై, బెంగుళూరు, ఢిల్లీ, కోల్ కత లాంటి మెట్రో నగరాల్లో ఐటీ ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలోనే పని చేస్తున్నారు. కరోనా కారణంగా ఉద్యోగులు కార్యాలయాలకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇంటి నుంచే పనులు చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో సంస్థలు ఉద్యోగులను కార్యాలయాలకు వచ్చేలా చూడాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. దీనికి ఉద్యోగులు కూడా సరే అంటున్నా కొన్ని షరతులు విధిస్తున్నారు.

వర్క్ ఫ్రం హోంలో ఉన్న సులభతరమైన వసతులు కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఉద్యోగులకు సరైన సదుపాయాలు కల్పిస్తేనే ఆఫీసులకు వస్తామని తెగేసి చెబుతున్నారు. పని ఒత్తిడి లేని వాతావరణం, మంచి ఫర్నిచర్, అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తూ ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు. ఇలాగైతేనే తాము ఆఫీసులకు వస్తామని బదులిస్తున్నారు. దీంతో యాజమాన్యాలు వారి కోరికలు తీర్చే క్రమంలో అన్ని వసతులు ఏర్పాటు చేసేందుకు నానా తంటాలు పడుతున్నాయి.
Also Read: Shruti Haasan: అమ్మో పెళ్లంటే భయం అంటున్న శృతి… అంటే ఆమె ఆంతర్యం ఏమిటీ?
సీఐఈఎల్ హెచ్ఆర్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. అందులో ఆసక్తికర విషయలు వెలుగు చూశాయి. హైదరాబాద్, ఢిల్లీ, బెంగుళూరు, ముంబ లాంటి మెట్రో నగరాల్లో ఐటీ ఉద్యోగులు భారీగానే ఉన్నారు. వారిపై సర్వే నిర్వహించగా అందులో పదిమందిలో ఆరుగురు ఇంటి నుంచే పని బాగుందని చెబుతున్నారు. దీంతో వర్క్ ఫ్రం హోంకే ఓటు వేస్తున్నారు. కానీ ఐటీ సంస్థలు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. కార్యాలయాల్లోనే విధులు నిర్వహించేలా చూడాలని చెబుతున్నాయి. ఇందుకు అనుగుణంగా అన్ని వసతులు కల్పిస్తామని తెలియజేస్తున్నాయి.

భాగ్యనగరంలో ప్రస్తుతం దాదాపు ఆరు లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారు. వారంతా వర్క్ ఫ్రం హోంకే ఇష్టపడుతున్నారు. కంపెనీలు తమ ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని ఆదేశాలు జారీ చేయడంతో వారు ససేమిరా అంటున్నారు. ఇంటి నుంచే పని సులభంగా ఉందని చెబుతున్నారు. దీనికి కంపెనీలు మాత్రం ఒప్పు కోవడం లేదు. కచ్చితంగా ఆఫీసులకు రావాల్సిందేనని హుకుం జారీ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులు ఇక మీదట ఆఫీసుకు రాక తప్పదని తెలుస్తోంది. కానీ సదుపాయాల విషయంలో మాత్రం పేచీ పెడుతున్నారు. తమకు ఇళ్లల్లో ఉన్న వసతులే కార్యాలయాల్లో ఉండాలని డిమాండ్లు పెడుతున్నారు.
Also Read:AP SSC Results – JanaSena: జగన్ కు ఇది అవమానం.. జనసేనకు కొత్త వరం..