Homeక్రీడలుDinesh Karthik: ఆసియా కప్ లో దినేష్ కార్తీక్ ను ఎందుకు ఆడించలేదు?

Dinesh Karthik: ఆసియా కప్ లో దినేష్ కార్తీక్ ను ఎందుకు ఆడించలేదు?

Dinesh Karthik: ఆసియా కప్ ఫేవరేట్ గా బరిలో దిగిన టీమిండియా అందరి అంచనాలు తలకిందులు చేస్తూ పోటీ నుంచి నిష్క్రమించడం ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చింది. కప్ గెలుస్తుందని ఆశించిన అభిమానుల ఆశలు అడియాశలే అయ్యాయి. రోహిత్ సేన చేసిన తప్పిదాలపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్, శ్రీలంకలతో జరిగిన మ్యాచ్ ల్లో టీమిండియా చేతులెత్తేయడంతో సమస్య మొదటికొచ్చింది. టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. అయినా మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నాడు. టీమిండియా రెండు మ్యాచ్ ల్లో చివరి వరకు పోరాడినా ఓటమి నుంచి తప్పించుకోలేకపోయిందని వివరణ ఇచ్చాడు. తాము చేసిన తప్పిదాలే వారికి ప్లస్ అయ్యాయని వ్యాఖ్యానించాడు.

Dinesh Karthik
Dinesh Karthik

దినేష్ కార్తీక్ ను జట్టులోకి తీసుకోకపోవడం కూడా ఓ మైనస్ గా మారింది. ఇటీవల కాలంలో అతడు పలు మ్యాచుల్లో రాణిస్తున్నా అతడిని పక్కన పెట్టేశారు. దీంతో అతడు లేని లోటు స్పష్టంగా కనిపించింది. మిడిలార్డర్ లో లెఫ్ట్, రైట్ హ్యాండ్ కాంబినేషన్ లో ఆటగాళ్లను తీసుకున్నా ఫలితం మాత్రం చేదుగానే వచ్చింది. కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్ ను తీసుకోవడంతో అతడు కీలక సమయాల్లో రాణించలేకపోవడంతో ఓటమి పాలయ్యాం. దీంతో దినేష్ అవసరమేమిటో తెలిసింది. ఇకపై ఆ తప్పు చేయకూడదని అనుకుంటున్నామని రోహిత్ శర్మ వెల్లడించాడు.

Also Read: Asia Cup 2022 Pak vs Afghanistan: ఆసియాకప్: పాకిస్తాన్ అభిమానులను స్టేడియంలోనే కొట్టిన అప్ఘనిస్తాన్ ఫ్యాన్స్.. వైరల్ వీడియో

లంకతో జరిగిన మ్యాచ్ లో ఇద్దరు ఓపెనర్లను తీసుకున్నా చాహల్, అశ్విన్ కు బంతిని ఇస్తే మంచిదని అనుకున్నాం. దీంతో వికెట్లు త్వరగా పడిపోతే హుడాకు బౌలింగ్ ఇద్దామని అనుకున్నా ఆ అవసరం రాలేదు. దీంతో నష్టపోయాం. వచ్చే ప్రపంచ కప్ కు ఇదో గుణపాఠంగా భావిస్తున్నామని చెప్పాడు. ఆసియా కప్ లో ఫేవరేట్ గా బరిలో దిగినా అందుకు అనుగుణంగా ఆడలేదు. ఇక్కడ చేసిన తప్పులు మళ్లీ చేయకుండా చూడాలని అనుకుంటున్నారు. వచ్చే సీజన్ లో నైనా మంచి ప్రదర్శన చేయాలని భావిస్తున్నారు.

Dinesh Karthik
Dinesh Karthik

వచ్చే టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును రెడీ చేస్తున్నారు. ఇప్పటికే 95 శాతం జట్టు కూర్పు తయారైనట్లు చెబుతున్నారు. రానున్న రెండు సిరీస్ ల తర్వాత ప్రపంచ కప్ లో ఏ కాంబినేషన్ లో ఆడాలనే దానిపై ఓ నిర్ణయానికి వస్తున్నాం. హార్థిక్ పాండ్యా తిరిగి జట్టులోకి రావడంతో ముగ్గురు సీమర్లతో ఆడేందుకు సిద్ధమయ్యాం. టీమిండియా రెండు ఓటములను మరిచిపోయి కొత్త తరహా ప్రదర్శన చేస్తామని చెబుతున్నారు. ఈ మేరకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన మనసులోని మాటను వెల్లడించాడు.

Also Read:Nagarjuna Vs Samantha: విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా హీరో నాగార్జున..! జనసేన అభ్యర్థిగా సమంత!?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular