Husband And Wife Relationship: భార్య భర్తల జీవితం అన్యోన్యమైంది. రెండు కుటుంబాల్లోని ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసుండడానికి దాంపత్య జీవితం సహకరిస్తుంది. అందుకే పెళ్లి జరిగేటప్పుడు ఏడడుగులతో ప్రత్యేక మంత్రాలు చదివి జీవితాంతం కలిసుండాలని దీవిస్తారు. పెళ్లయిన తరువాత సంసార జీవితం ఎంతో హాయిగా ఉంటుంది. కానీ ఇదే సమయంలో కొన్ని కష్టాలు కూడా ఎదురవుతాయి. అయితే కొన్ని పద్ధతులు పాటించాలని పూర్వం నుంచి పెద్దలు చెబుతున్నారు. కొందరుపట్టించు కోవడం లేదు. కానీ వాటిని పాటించిన వారు మాత్రం సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. పెద్దలు చెప్పిన వాటిలో భర్త ఎడమ వైపు భార్య ఉండాలంటారు.. అలాగే భర్తకు ఎడమ వైపున భార్య నిద్రించాలంటున్నారు.. అసలెందుకు?
పురాణాల ప్రకారం మహాశివుడి ఎడమ వైపు నుంచి ఒక స్త్రీ జన్మించిందని అంటారు. అందుకే భార్యను వామంగి అని పిలుస్తారని చెబుతున్నారు. వామంగి అంటే మనిషి శరీరంలోని ఎడమవైపు అని అర్థం. అయితే పెళ్లి చేసుకునేటప్పుడు, నామకరణం, అన్న ప్రశాన సమయంలో భర్తకు కుడివైపున భార్యను కూర్చోబెడుతారు. ఎందుకంటే ఇక్కడ పురుషుబలం ఎక్కువగా ఉంటుంది. పూజల్లోపురుసాధిక్యత ఎక్కువగా ఉండడం వల్ల పురుషులకు సంబంధించినవే మంత్రాలు ఆచరించడం వల్ల వారిని ఇలా కూర్చోబెడుతారు.
భోజన సమయంలో , ఆశీర్వాదం పొందుతున్నప్పుడు భార్యను ఎక్కువగా ఎడమ వైపు కూర్చోమంటారు. ఎందుకంటే ఇవి స్త్రీకి సంబంధించిన పనులు. ఇక్కడ పురుషుల కంటే స్త్రీలదే ఆధిక్యత ఉంటుంది. ఉదాహరణకు ఆశీర్వాదం పొందేటప్పుడు స్త్రీనే సుమంగళిగా ఉండాలని ఆశీర్వదిస్తారు. అందువల్ల ఇలాంటి సమయాల్లో వారికే ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి వారిని భర్తకు ఎడమ వైపు కూర్చోబెడుతారు.
అయితే నిద్రించే సమయంలోనూ భర్తకు ఎడమ వైపున భార్యఉండాలంటున్నారు. ఇలా నిద్రించడం వల్ల వారి మధ్య ప్రేమ వృద్ధి చెందుతుంది. వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సాధారణంగానే మహిళలు ఎడమ వైపు నిద్రించాలని చెబుతున్నారు. అలాగే భర్తతో ఉన్నప్పుడు కూడా భర్తకు ఎడమ వైపున నిద్రించడం వల్ల ఎలాంటి వాస్తుదోశం ఉండదని చెబుతున్నారు.