Passports: భారత పాస్‌పోర్ట్ అనేది దేశ పౌరులకు అంతర్జాతీయ ప్రయాణానికి జారీ చేసే ముఖ్యమైన పత్రం. ఇది ఒక వ్యక్తి గుర్తింపు కార్డు, ఇది అతని భారత పౌరసత్వాన్ని చూపుతుంది. మీరు పాస్‌పోర్ట్ ఉంటే దాని కవర్ నీలం రంగులో ఉండటం గమనించే ఉంటారు కదా. చాలా మందికి ఈ రంగు పాస్‌పోర్ట్ ఉంటుంది. కానీ కొంతమంది పాస్‌పోర్ట్ రంగు కూడా తెలుపు లేదా మెరూన్ (3 రకాల పాస్‌పోర్ట్‌లు) గా ఉంటుంది. ఈ పాస్‌పోర్ట్ రంగులు వాటి స్వంత ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అవి పాస్‌పోర్ట్ హోల్డర్ వర్గాన్ని, వారి హక్కులను ప్రతిబింబిస్తాయి. భారతదేశంలో అందుబాటులో ఉన్న వివిధ రకాల పాస్‌పోర్ట్‌ల అర్థం, వాటి మధ్య తేడాను తెలుసుకుందాం.
Also Read: బడ్జెట్ ఫ్రెండ్లీ సీఎన్జీ కార్స్.. మైలేజ్‌తో పాటు డిక్కీ స్పేస్‌లోనూ సూపర్!
వివిధ రకాల భారతీయ పాస్‌పోర్ట్‌లు
నీలం రంగు పాస్‌పోర్ట్ (సాధారణ పాస్‌పోర్ట్)
భారతదేశంలోని సాధారణ పౌరులకు నీలం రంగు పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. ఇది అత్యంత సాధారణ పాస్‌పోర్ట్ రకం. దీనిని “సాధారణ పాస్‌పోర్ట్” అంటారు. కామన్ గా ఈ పాస్‌పోర్ట్ విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు లేదా సాధారణ ప్రయోజనాల కోసం ప్రయాణించే వ్యక్తులకు జారీ చేస్తారు. ఈ పాస్‌పోర్ట్ 36 లేదా 60 పేజీల ఎంపికతో జారీ చేస్తారు. ఈ పాస్‌పోర్ట్ “ఇ-పాస్‌పోర్ట్” అని లేబుల్ తో చేస్తారు. అంటే దీనిలో ఒక ఎలక్ట్రానిక్ చిప్ అమరుస్తారు. ఇది హోల్డర్ బయోమెట్రిక్ సమాచారాన్ని నిల్వ చేస్తుంది. ఈ పాస్‌పోర్ట్ భారతదేశ దౌత్య హోదా ఆధారంగా కొన్ని దేశాలకు వీసా రహిత ప్రయాణాన్ని అనుమతిస్తుంది.
తెలుపు రంగు పాస్‌పోర్ట్ (అధికారిక పాస్‌పోర్ట్)
నీలం రంగు పాస్‌పోర్ట్‌ను “అధికారిక పాస్‌పోర్ట్” లేదా “సర్వీస్ పాస్‌పోర్ట్” అంటారు. ఈ పాస్‌పోర్ట్ భారత ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు వారి అధికారిక పర్యటనల కోసం జారీ చేస్తారు. ఈ పాస్‌పోర్ట్‌ను అధికారిక పనికి మాత్రమే ఉపయోగించవచ్చు. వ్యక్తిగత ప్రయాణానికి కాదు. దానిపై “అధికారిక పాస్‌పోర్ట్” అని రాసి ఉంటుంది. ఇది సాధారణ పాస్‌పోర్ట్ కంటే భిన్నంగా ఉంటుంది. ఈ పాస్‌పోర్ట్ హోల్డర్లు కొన్ని దేశాలలో వీసా మినహాయింపులు లేదా ప్రత్యేక అధికారాలను పొందవచ్చు.
మెరూన్ రంగు పాస్‌పోర్ట్ (డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్)
మెరూన్ లేదా ఎరుపు-గోధుమ రంగు పాస్‌పోర్ట్‌ను “డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్” అని పిలుస్తారు. దీనిని భారతదేశంలోని ఉన్నత స్థాయి అధికారులు, దౌత్యవేత్తలు, రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, మంత్రులు మొదలైన వారికి జారీ చేస్తారు. ఈ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నవారు అంతర్జాతీయ స్థాయిలో దౌత్యపరమైన ఫెసిలిటీస్ ను పొందుతారు. దానిపై “డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్” అని రాసి ఉంటుంది. ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన పాస్‌పోర్ట్‌గా పరిగణిస్తారు. ఈ పాస్‌పోర్ట్ హోల్డర్ వీసా లేకుండా అనేక దేశాలకు ప్రయాణించడానికి అనుమతిస్తుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugunews.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
Also Read: స్కూటర్ కావాలా? బైక్ కావాలా? ఓలా దగ్గర అన్నీ రెడీ! మీ ఇష్టం!