https://oktelugu.com/

White Hair: తెల్లజుట్టు.. అనారోగ్యాన్ని సూచిస్తుందా..?

చిన్న వయసులోనే ఈ విధంగా తెల్ల జుట్టు రావడం మన శరీరంలో ఏదైనా అనారోగ్యాన్ని సూచిస్తుందా? అని అనుమానాలు వ్యక్తం అవుతుంటాయి. అయితే జుట్టు తెల్లబడటాన్ని వ్యాధి సంకేతంగా భావించాల్సిన పని లేదని సైంటిస్టులు చెబుతున్నారు.

Written By: , Updated On : January 30, 2024 / 04:01 PM IST
White Hair
Follow us on

White Hair: సాధారణంగా ఇది వరకు దాదాపు 40 సంవత్సరాలు దాటిన తరువాత తెల్లజుట్టు కనిపించేంది. ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలకు సైతం తెల్లజుట్టు వస్తుంది. ఈ సమస్య చిన్నాపెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తోందని చెప్పుకోవచ్చు.

చిన్న వయసులోనే ఈ విధంగా తెల్ల జుట్టు రావడం మన శరీరంలో ఏదైనా అనారోగ్యాన్ని సూచిస్తుందా? అని అనుమానాలు వ్యక్తం అవుతుంటాయి. అయితే జుట్టు తెల్లబడటాన్ని వ్యాధి సంకేతంగా భావించాల్సిన పని లేదని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ విధంగా తెల్ల జుట్టు రావడానికి పలు కారణాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలింది.

అధిక రసాయనాలతో తయారు చేసిన షాంపూలు, కండీషనర్స్ వంటి వాటిని ఎక్కువగా వాడటం వలన జుట్టు తెల్లగా అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అధిక మొత్తంలో సల్ఫేట్ తో పాటు దానికి సంబంధించిన పదార్థాలు ఉండటం వలన జుట్టు పొడిబారడం, రాలిపోవడం, నెరిసిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయట. ప్రస్తుతం హెయిర్ కలరింగ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జుట్టుకు రంగు వేయడానికి రసాయనాలు ఉపయోగించిన కలర్స్ ను ఎక్కువగా వాడుతుంటారు. ఇది జుట్టును దెబ్బతీస్తుంది. ఇందుకోసం షాంపూల్లో ఒమేగా -6, ఒమేగా -3 మరియు బయోటిన్, కెరోటిన్ వంటి పదార్థాలు ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. అలాగే సల్ఫేట్ గాఢత తక్కువగా ఉన్న షాంపూలను వినియోగించాలి.

అదేవిధంగా శరీరంలో విటమిన్ డి, విటమిన్ బీ12, మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోవడం వలన కూడా తెల్లజుట్టు వస్తుందంట. దాంతో పాటు థైరాయిడ్ సమస్యలు, ధూమపానం, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన మరియు నిద్రలేమి వంటి పలు కారణాల వలన తెల్ల జుట్టు వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

తెల్ల జుట్టు సమస్య రాకుండా ఉండాలంటే బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవాలి. అలాగే ఆహారంలో పప్పులు, పాల ఉత్పత్తులు, పచ్చి కూరగాయలను ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. టైంకు నిద్రపోవడం మరియు ధూమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు తెలిపారు.