Homeలైఫ్ స్టైల్Rice Or Chapati At Night: రాత్రిపూట చపాతీ మంచిదా? భోజనం మంచిదా? వైద్యులేం చెప్పారంటే?

Rice Or Chapati At Night: రాత్రిపూట చపాతీ మంచిదా? భోజనం మంచిదా? వైద్యులేం చెప్పారంటే?

Rice Or Chapati At Night: ప్రస్తుత కాలంలో మనలో చాలామంది తినే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలామంది ఆహారపు అలవాట్లలో కీలక మార్పులు చేసుకుంటున్నారు. కొంతమంది రాత్రి సమయంలో చపాతీని తీసుకోవడానికి ఆసక్తి చూపితే మరి కొందరు భోజనం తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Rice Or Chapati At Night
Rice Or Chapati At Night

రాత్రి సమయంలో చపాతీ మంచిదా? లేక భోజనం మంచిదా? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తోంది. అయితే ఎవరైతే బరువు తగ్గాలని భావిస్తారో వాళ్లు చపాతీలను తింటే మంచిదని చెప్పవచ్చు. పెరుగు, కూరగాయలు, పప్పుతో చపాతీలను తింటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. చపాతీల ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం, ఫాస్పరస్, జింక్ లభిస్తాయి. రాత్రి సమయంలో త్వరగా భోజనం చేస్తే మంచిదని చెప్పవచ్చు.

Also Read: ఎన్టీఆర్ ను వాడుకొని చంద్రబాబు-లోకేష్ పై వైసీపీ దాడి?

ప్రాసెస్ చేయడం ద్వారా అన్నం, చపాతీలు తయారు చేస్తారనే సంగతి తెలిసిందే. చపాతీ, రోటీలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఫైబర్ ఉండటం వల్ల చపాతీ, రోటీలను తినేవాళ్లకు త్వరగా ఆకలి వేసే అవకాశం అయితే ఉండదని చెప్పవచ్చు. పాలిష్ బియ్యం తినడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభించవు. ప్రోటీన్ వినియోగం పెంచి కార్బోహైడ్రేట్లను తగ్గిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పవచ్చు.

మధ్యాహ్న సమయంలో రైస్ తీసుకున్నా పరవాలేదని రాత్రి సమయంలో మాత్రం తప్పనిసరిగా చపాతీలను తీసుకోవాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. రాత్రి సమయంలో చపాతీలు తినాలా? అన్నం తినాలా? అని కన్ఫ్యూజ్ అయ్యేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు.

Also Read: బీజేపీతో ఇక తెగదెంపులేనా..? దూరంగా ఉంటున్న పవన్? కారణం నాగబాబేనా?

Recommended Video:

7 Arts Sarayu Crying || Sarayu Hamida Fight || Bigg Boss Telugu OTT || Ok Telugu Entertainment

 

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version